గాడ్ ఆఫ్ వార్: ఎన్టీఆర్‌కు చెక్ పెట్టిన ధనుష్.. ఈ ట్విస్టేంటి?
ABN , Publish Date - Jul 11 , 2026 | 04:55 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు చెక్ పెట్టిన కోలీవుడ్ స్టార్ ధనుష్.. అనేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ధనుష్-వెట్రి మారన్ కాంబోలో ప్రకటించిన ‘తమిళ మురుగన్’ చిత్రమే.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR)కు చెక్ పెట్టిన కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush).. అనేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ధనుష్-వెట్రి మారన్ కాంబోలో ప్రకటించిన ‘తమిళ మురుగన్’ (Thamizh Murugan) చిత్రమే. అవును, ఎవరూ ఊహించని విధంగా ధనుష్ హీరోగా వెట్రిమారన్ ఈ సినిమాను ప్రకటించడంతో.. ఈ ట్విస్ట్ ఏంటి? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ‘దేవసేనాని’ కుమారస్వామిని ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War)గా కీర్తిస్తారు. కుమారస్వామి గాథను ఆధారం చేసుకొని ఇప్పుడు రెండు చిత్రాలు తెరకెక్కనున్నాయి. ఒకటి తెలుగులో, మరోటి తమిళంలో- రెండూ క్రేజీ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ధనుష్ ఈ చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో అందరిలోనూ ఆసక్తి అధికమైంది. మొదట ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో మూవీ నుంచి అధికారిక ప్రకటనతో పాటు ఓ పోస్టర్ వదిలారు. ధనుష్ - వెట్రిమారన్ (Vetri Maaran) కాంబో మూవీకి సంబంధించి ఏకంగా గ్లింప్సే వదిలేశారు. అంటే.. ధనుష్ అండ్ టీమ్ చాలా ఫాస్ట్‌గా ఉన్నారనే విషయం ఇక్కడ స్పష్టం చేశారు.
మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాయావి త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబోలో కుమారస్వామి పౌరాణిక గాథగా తెరకెక్కనున్న మూవీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందనేది క్లారిటీ లేదు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు కానీ, ‘గాడ్ ఆఫ్ వార్’ అని ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. ఇక మేకర్స్ వదిలిన ప్రకటనలో ఓ శ్లోకాన్ని పొందుపరిచారు. ఆ శ్లోకం ప్రకారం కుమారస్వామి ఉత్తరాదికి చెందినవారని తెలుస్తోంది. దాంతో తమిళులు కినుక వహించారు. ఎందుకంటే కుమారస్వామిని ‘మురుగన్’ అంటూ ఆరాధించే తమిళులకు ఆయనపై భక్తిభావాలు మెండుగా ఉన్నాయి. ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ ప్రకటనలోని శ్లోకం వివాదాలకు తెరతీసింది. దాంతో నటుడు, దర్శక నిర్మాత, తమిళ రాజకీయనాయకుడు అయిన సీమాన్ ‘తమిళులకు అత్యంత ఆరాధ్యుడైన కుమారస్వామి’ కథను సినిమాటిక్ ఫ్రీడమ్‌తో వక్రీకరిస్తే సహించేది లేదనీ హెచ్చరించారు. ఇదిలా ఉండగానే ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘తమిళ్ మురుగన్’ అనే సినిమా ప్రకటన వెలువడింది. ఇది కూడా పౌరాణికమే కావడం విశేషం. ఓ వైపు తెలుగువారు తమ మురుగన్ కథను వక్రీకరిస్తారేమో అని తమిళులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘తమిళ్ మురుగన్’ అనే టైటిల్‌తో సినిమా ప్రకటించి.. ఒక రకంగా ఎన్టీఆర్ అండ్ టీమ్‌కు ధనుష్- వెట్రిమారన్ చెక్ పెట్టారనే భావించవచ్చు.
ఇప్పుడు వీటిలో ఏ మూవీ ముందు వస్తుందా? ఎన్టీఆర్ బాగా చేస్తారా? లేదంటే ధనుష్ బాగా నప్పుతాడా? అనేలా అప్పుడే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే, వీరిద్దరూ అలాంటి స్టార్స్ మరి. ఇటు ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో.. అటు ధనుష్ - వెట్రిమారన్ కలయిక రెండూ క్రేజ్ ఉన్నవే. ఇంతకు ముందు ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌కు గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్ ఉంది.. పైగా పౌరాణిక పాత్రలకు నందమూరి ఫ్యామిలీ పెట్టింది పేరు. ఎన్టీఆర్ కూడా ఇప్పటికే శ్రీరామ, మార్కండేయ, యువ యమ వంటి పురాణ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దాంతో యన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే కుమారస్వామి పౌరాణిక గాథపై సర్వత్రా ఆసక్తి చోటు చేసుకుంది. ఇక అటు ధనుష్- వెట్రిమారన్ కాంబినేషన్ కూడా ఎంతో క్రేజ్ ఉన్నదే. వెట్రిమారన్ తన తొలి చిత్రం ‘పొల్లాదవన్’తోనే ధనుష్‌ను హీరోగా ఎంచుకొని బిగ్ హిట్ సాధించారు.. తర్వాత వెట్రిమారన్ తెరకెక్కించిన ‘ఆడుకాలమ్’తో ధనుష్‌కు నేషనల్ అవార్డ్ లభించింది. ఆ పై వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వడ చెన్నై, అసురన్’ చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. వీటిలో ‘అసురన్’తోనూ రెండోసారి జాతీయ స్థాయిలో ఉత్తమనటునిగా నిలిచారు ధనుష్. ఈ నేపథ్యంలోనే ధనుష్-వెట్రిమారన్ కాంబోలో రాబోయే ‘తమిళ్ మురుగన్’కు కూడా ఓ స్పెషల్ క్రేజ్ చోటు చేసుకుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ తన ‘డ్రాగన్’ మూవీని పూర్తి చేయవలసి ఉంది.. అదయ్యాకే త్రివిక్రమ్ మూవీలో పాల్గొంటారు. బహుశా ఈ యేడాది చివరలో కానీ, వచ్చే సంవత్సరం ఆరంభంలో కానీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ధనుష్- వెట్రిమారన్ కాంబోలో వచ్చే ‘తమిళ్ మురుగన్’ కూడా ఈ యేడాదే ఆరంభం కానుంది. అదే జరిగితే.. ధనుష్ చిత్రమే ముందు వచ్చే అవకాశం ఉంది. ఎలా చూసినా, ఎన్టీఆర్ చేసే సినిమాకు ధనుష్ సినిమా ఏదో విధంగా అడ్డుతగిలేలానే ఉంది. అందుకే.. ఎన్టీఆర్‌కు చెక్ పెట్టిన ధనుష్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలపై మరింత స్పష్టత రావాలంటే మాత్రం.. మేకర్స్ రియాక్ట్ అవ్వాల్సిందే.
ఇవి కూడా చదవండి:
Jagapathibabu: మళ్లీ హీరోగా చేయడానికి కారణమదే..
అయ్యగారి కంబ్యాక్ అదుర్స్.. అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్!
సావిత్రమ్మ అద్భుతాలకే అద్భుతం: బ్రహ్మానందం