జర్నలిస్ట్ ప్రభు పుస్తకం తొలి ప్రతికి రూ.5 లక్షలు.. ఛారిటబుల్ ట్రస్ట్‌కు రూ.11 లక్షల విరాళం

ABN , Publish Date - Oct 29 , 2026 | 02:03 PM

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు జన్మదినం సందర్భంగా ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు -2’ పుస్తకావిష్కరణ జరిగింది. తొలి ప్రతిని నిర్మాత ఆదిత్య రామ్ రూ.5 లక్షలకు కొనుగోలు చేశారు. ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్‌కు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రూ.11,11,111 విరాళం ప్రకటించారు.

Journalist Prabhu Book Launch

సీనియర్‌ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు రాసిన 'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు -2' పుస్తకావిష్కరణ ఆయన జన్మదినం సందర్భంగా అక్టోబర్ 28వ తేదీ ఎఫ్.ఎన్.సి.సి.లో జరిగింది. సీనియర్‌ నటుడు సుమన్‌ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని ప్రముఖ నిర్మాత, రియాల్టర్‌ ఆదిత్య రామ్‌కు అందించారు. ఆయన తొలి కాపీని రూ. 5 లక్షలకు కొనుగోలు చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో సీనియర్‌ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కాట్రగడ్డ ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి, జేడీ చక్రవర్తి, రేలంగి నరసింహారావు, ఉత్తేజ్‌, సుచిత్ర చంద్రబోస్‌, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభు రాసిన 'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు -2' పుస్తకం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గద్దర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.


ఇదే వేదికపై జర్నలిస్ట్ గా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రభు... తన భార్య జ్ఞాపకార్థం ఆడెపు దుర్గా మాధవీ ప్రభు ఛారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. దీని ద్వారా అపన్నులకు విద్య, ఆరోగ్యం అందించే కార్యక్రమాలు చేపడతామని ప్రభు తెలిపారు. ఈ ఛారిటబుల్‌ ట్రస్ట్ కు తన వంతుగా రూ.11,11, 111 లను విరాళంగా ఇస్తున్నట్టు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు. ఆత్మీయ పాత్రికేయులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అనంతరం జర్నలిస్ట్ ప్రభు బర్త్ డే కేక్‌ను కట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నిర్మాత కన్నుమూత

‘ఆదర్శకుటుంబం’లో టెన్షన్.. అసలు విషయం ఏంటంటే

‘కిల్లర్’ సినిమా ట్విస్ట్ చెబితే రూ. కోటి.. కాంటెస్ట్ రూల్స్ ఇవే

Updated Date - Oct 29 , 2026 | 02:07 PM