సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యూట్యూబ్‌లో.. దుమ్మురేపుతున్న నాగ‌దుర్గ కొత్త‌పాట‌

ABN, Publish Date - Sep 28 , 2026 | 09:47 PM

తెలంగాణ ఫోక్ సెన్షేష‌న్ నాగ‌దుర్గ న‌టించిన కొత్త వీడియో సాంగ్ విడుద‌లై సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తోంది.

Naga Durga

తెలంగాణ‌ జాన‌పాద గీతాలతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా ఎదిగి ఇటీవ‌ల హీరోయిన్‌గా కెరీర్ ట‌ర్న్ తీసుకుని వ‌రుస అవ‌కాశాల‌తో తూసుకెళుతుంది అచ్చ తెలుగందం నాగ‌దుర్గ (Naga Durga). ఓవైపు సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తూనే త‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపును, స్టార్ స్టేట‌స్‌ను తెచ్చిపెట్టిన ఫోక్ సాంగ్స్‌ను కొన‌సాగిస్తూ అభిమానుల‌ను రంజింప చేస్తోంది. ఈ మ‌ధ్యే అమె హీరో ప్రియ‌ద‌ర్శి (Priyadarshi) తో క‌లిసి న‌టిస్తున్న ఇడుపు కాయితం (Idupu Kayitham) చిత్రం నుంచి ఓ శ్రీల‌త (Srilatha) అనే పాట విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ రెస్పాన్స్ ద‌క్కించుకుంది.

ఈక్ర‌మంలో తాజాగా నాగ‌దుర్గ‌ నటించిన అయ్యో నీ బంగుళాకు (Bangula Full Song) అంటూ సాగే నూత‌న తెలంగాణ జాన‌ప‌ద పాట రెండు రోజుల క్రితం యూ ట్యూబ్‌లో విడుద‌లై సంచ‌ల‌నం సృష్టిస్తోంది. క‌మ‌ల్ ఎస్లావ‌త్ (Kamal Eslavath) సాహిత్యం అందించిన ఈ పాట‌కు మ‌దీన్ ఎస్కే సంగీతం అందించ‌గా నాగ‌వ్వ (Nagavva) , మ‌ధు ప్రియ (Madhupriya) అల‌పించారు. 4 నిమిషాల 23 సెకండ్ల నిడివి ఉన్న ఈ పాట‌లో ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు నాగ‌దుర్గ త‌న దైన శైలి డ్యాన్స్‌, స్టెప్పులు, హావా బావాల‌తో శీక్ష‌కుల‌కు క‌నువిందు చేసింది. ప్ర‌స్తుతం ఈ గవీడియో గీతం సామాజిక మాధ్య‌మాల్లో ట్రాప్‌ళో ట్రెండ్ అవుతుంది. మీరూ ఈ పాట‌పై ఓ లుక్ వేయండి మ‌రి.

Updated Date - Sep 28 , 2026 | 09:47 PM