సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బీజేపీపై సంచలన ఆరోపణలు.. విజయ్ ‘టీవీకే’లోకి నటుడు దేవన్

ABN, Publish Date - Aug 24 , 2026 | 04:48 PM

మలయాళ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు దేవన్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

Devan and TVK Vijay

మలయాళ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు దేవన్ (Senior Actor Devan) భారతీయ జనతా పార్టీకి (BJP) రాజీనామా చేసి, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీని వీడిన అనంతరం ఆయన ఆ పార్టీ పనితీరుపై తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలవడం కంటే డబ్బు సంపాదించడంపైనే బీజేపీ నేతలు ఎక్కువ దృష్టి పెట్టారని, తన రాజకీయ ఆశయాలు అక్కడ నెరవేరవనే ఉద్దేశంతోనే బయటకు వచ్చానని ఆయన కుండబద్దలు కొట్టారు. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఆహ్వానం మేరకు త్వరలోనే ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు స్పష్టం చేశారు.


బీజేపీ నుంచి వైదొలగడానికి గల కారణాలను దేవన్ వివరిస్తూ.. ‘‘నేను ఎంతో ధైర్యంగా, ఎన్నో రిస్క్‌లు తీసుకుని బీజేపీ కోసం తీవ్రంగా శ్రమించాను. కానీ వారు నా విజన్‌ను, ప్రణాళికలను ఏమాత్రం అర్థం చేసుకోలేదు. ఆ పార్టీకి ఎన్నికల్లో గెలవడం పట్ల పెద్దగా ఆసక్తి లేదు, కేవలం డబ్బులు సంపాదించడమే వారి ప్రధాన ధ్యేయంగా మారింది. దానిని నేను తీవ్రంగా వ్యతిరేకించడంతో నన్ను పక్కన పెట్టేశారు. 2024-25 టైమ్‌లోనే ఈ పార్టీలో కొనసాగితే నా రాజకీయ ఆశయాలు నెరవేరవని అర్థమై రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని దేవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


తాను బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలుసుకున్న తమిళనాడు సీఎం విజయ్, తనను టీవీకేలో చేరాల్సిందిగా కోరుతూ ప్రతినిధులను పంపించారని దేవన్ వెల్లడించారు. ఇప్పటికే చెన్నైలోని టీవీకే సీనియర్ నాయకులతో ఆన్‌లైన్ సమావేశం ద్వారా విస్తృతంగా చర్చలు జరిపానని, పార్టీలో చేరేందుకు సూత్రప్రాయంగా అంగీకరించానని తెలిపారు. పార్టీ అధినేత విజయ్‌తో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు సెప్టెంబర్ 10వ తేదీన సమయం ఇచ్చారని, ఆ భేటీ తర్వాత అధికారికంగా టీవీకే తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేరళ, తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి:

Varanasi: 50 భాషల్లో.. జక్కన్న అంటే ఆ మాత్రం ఉండాల్సిందే

కేవలం 3 రోజుల్లోనే.. రవన్న బాక్సాఫీస్ ర్యాంపేజ్

‘రంగస్థలం’ ఫేమ్ మహేష్ హీరో అవుతున్నాడు.. సినిమా టైటిల్ ఇదే

Updated Date - Aug 24 , 2026 | 04:48 PM