Bigg Boss: ఈసారి సామాన్యులకు పెద్ద పీట!
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:35 AM
బిగ్ బాస్ షో వీక్షకులు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ బాగా పెరిగారని చెబుతున్నారు జియోస్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ సౌత్ క్లస్టర్ హెడ్ కృష్ణన్ కుట్టి. కింగ్ నాగార్జున హోస్ట్ గా నటించే తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 సెప్టెంబర్ 6 నుంచి మొదలు కానుంది.
‘బిగ్‌బాస్‌ని చూసే ప్రేక్షకుల సంఖ్య సీజన్ సీజన్‌కీ పెరుగుతోంది. అందుకే మేం కూడా సరికొత్త ప్రయోగాలు చేయడానికి ఉత్సాహపడుతున్నాం. ఈ ఏడాది పదో సీజన్‌లో ప్రతి ఎపిసోడ్ పండగలా ఉంటుంది’ అని అన్నారు జియోస్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ సౌత్ క్లస్టర్ హెడ్ కృష్ణన్ కుట్టి. సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి బిగ్‌బాస్ పదో సీజన్ ప్రారంభమవుతుంది.
ఈ సందర్భంగా ఆయన ‘చిత్రజ్యోతి’తో మాట్లాడుతూ ‘నాగార్జున హోస్ట్‌గా మా పదో సీజన్ సిద్ధమవుతోంది. గత సీజన్‌లో అగ్నిపరీక్షను తెలుగు మార్కెట్‌లో ప్రారంభించాం. సామాన్యులు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి రావాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టాం. గతేడాది 16 మంది కంటెస్టంట్లలో ఐదుగురు సామాన్యులున్నారు. తెలుగులో సూపర్ సక్సెస్ అయిన ఈ ఫార్ములాను ఇప్పుడు సౌత్‌లో మిగిలిన మూడు భాషల్లో ప్రవేశపెడుతున్నాం. బిగ్‌బాస్‌లో సామాన్యులకి పెద్ద పీట వేస్తున్నాం. సెలబ్రిటీలను బిగ్‌బాస్‌కి తీసుకురావడానికి మేం పెద్దగా ఇబ్బంది పడటం లేదు. ప్రతి ఏడాది కొత్త సెలబ్రిటీలు పుట్టుకొస్తూనే ఉన్నారు. సినిమా, సోషల్ మీడియా, టీవీ సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు జనాల్లో పేరు తెచ్చుకుంటూనే ఉన్నారు. ఎవరికైనా బిగ్‌బాస్ చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్. కోట్లాది మంది ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ షోలో పార్టిసిపేట్ చేసి వెళ్లిన తర్వాత కంటెస్టంట్ల కెరీర్‌లలో గొప్ప అభివృద్ధి కనిపిస్తోంది. అందుకే ఫిల్మ్, టీవీ సెలబ్రిటీలకే పరిమితం కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లను, సామాన్యులను కూడా ఎంపిక చేస్తున్నాం. జెన్‌జీ ఆడియన్స్‌లో వాళ్లకు మంచి ఆదరణ ఉంది. మా షోలో అన్నీ రకాలుగా కొత్త డైమన్షన్స్‌ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో కంటెంట్ చూస్తున్నవారి సంఖ్య చాలా పెరిగింది. ఓటీటీలోనూ బిగ్‌బాస్ ఎపిసోడ్స్‌కి విపరీతమైన ఆదరణ ఉంది. 24 గంటల ఫుటేజ్‌నీ చూడ్డానికి ఇష్టపడుతున్నారు. ఇంట్రస్టింగ్ క్లిప్స్ కట్ చేసి వైరల్ చేస్తున్నారు. బిగ్‌బాస్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అగ్నిపరీక్ష ఎపిసోడ్స్‌ని కూడా పూర్తిగా చూస్తున్నారు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
హీరోయిన్లు కాదు.. విలన్లు! నెగెటివ్ పాత్రలతో మెప్పిస్తున్న భామలు
Raviteja: ‘ఇరుముడి’ తర్వాత రవితేజ స్పీడ్.. ఐశ్వర్య రాజేశ్‌తో కొత్త ప్రయోగం!
కృతి సనన్ రాఖీ యాడ్ వివాదం.. మధు చోప్రా హాట్ కామెంట్స్!