సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రష్మికకు.. తెలంగాణ 'బతుకమ్మ' చీర గిఫ్ట్

ABN, Publish Date - Oct 17 , 2026 | 07:03 PM

టాలీవుడ్‌ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేక కానుక అందించారు.

టాలీవుడ్‌ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Mallu Bhatti vikramarka) ప్రత్యేక కానుక అందించారు. తెలంగాణలో జంటగా తొలి దసరా పండుగ జరుపుకుంటున్న ఈ ఇద్దరికీ ఆయన ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రష్మికకు సంప్రదాయ బతుకమ్మ చీరను దసరా కానుకగా అందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ చీరను బహూకరించడం విశేషంగా నిలిచింది. తెలంగాణ చేనేత కళాకారుల అద్భుత నైపుణ్యాన్ని, గొప్ప వారసత్వాన్ని గౌరవించే ఉద్దేశంతో ఈ కానుకను అందించినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

రాష్ట్ర చేనేత రంగం ప్రత్యేకతను చాటిచెప్పడంతో పాటు, స్థానిక కళాకారుల శ్రమకు గుర్తింపునివ్వడం ఈ కానుక వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన సందేశం ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల జీవిత ప్రయాణం ప్రేమ, ఆనందం, పరస్పర అనుబంధంతో నిండిపోవాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఈ జంటకు భవిష్యత్తులో మరెన్నో సంతోషకరమైన క్షణాలు కలగాలని శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

‘కల్కి 2’ షూటింగ్‌పై అప్‌డేట్.. సాయిపల్లవి ఎంట్రీపై టాక్

దీపావళి రేసులో సూర్య, నయనతార.. విజేత ఎవరు?

‘బాషా’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

Updated Date - Oct 17 , 2026 | 09:00 PM