సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సుకుమార్ మూడో శిష్యుడు.. ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా?

ABN, Publish Date - Sep 29 , 2026 | 12:07 PM

దర్శకుడు సుకుమార్ శిష్యులుగా ఇండస్ట్రీలోకి వచ్చి దర్శకులుగా మారిన వారు టాలీవుడ్‌లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Karthik Varma

దర్శకుడు సుకుమార్ (sukumar) శిష్యులుగా ఇండస్ట్రీలోకి వచ్చి దర్శకులుగా మారిన వారు టాలీవుడ్‌లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, వీరిలో చాలామంది తమ రెండో సినిమా విషయంలో తడబడుతున్నారు. బుచ్చిబాబు సానా (buchibabu sana) దీనికి మొదటి ఉదాహరణ. ఆయన 'ఉప్పెన' సినిమాతో సంచలన డెబ్యూ ఇచ్చి, రాబోయే కాలంలో చూడదగ్గ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆయన రెండో సినిమా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కంటెంట్ పరంగా, అలాగే వాణిజ్యపరంగా కూడా ఈ సినిమా యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కలెక్షన్ లెక్కలు 'ఉప్పెన'ను మించి ఉన్నా... ఓవర్ ఆల్ గా రెండో సినిమా కేవలం ఓకే అనిపించుకుంది. అంతే!

ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల (srikanth odela) కూడా తన మొదటి విజయవంతమైన చిత్రం 'దసరా' తర్వాత, నానితో కలిసి 'ది ప్యారడైజ్' ( the paradise) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'దసరా' మహా గొప్ప సినిమా కాకపోయినా, ఒక మోస్తరుగా చూసేలా ఉండి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అంతేకాకుండా ఆయనను ఒక మంచి ఫ్యూచర్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చిపెట్టింది.

కానీ 'ది ప్యారడైజ్' మాత్రం అతిగా చేసిన నటన, వికారం తెప్పించే హింస, అర్థం లేని కథతో సాధారణ సినిమాగా మిగిలింది. అయితే, రిలీజ్ ముందు క్రియేట్ అయిన హైప్, పాటలు, నానీకి ఉన్న క్రెడిబిలిటీ వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా పడిపోలేదు. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో మొదటి నాలుగు రోజులు ఇది బాగానే కలెక్ట్ చేసింది. ఒకవేళ సినిమా బాగుండి ఉంటే, ఉన్న హైప్, క్రేజ్ కారణంగా ఈపాటికి ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచేది. కానీ శ్రీకాంత్ ఓదెలను 'సెకండ్-ఫిల్మ్ సిండ్రోమ్' తీవ్రంగా దెబ్బతీసింది.

ఇప్పుడు అందరి దృష్టి కార్తీక్ దండు (Karthik Varma Dandu) పై పడింది. 'విరూపాక్ష'తో బలమైన ముద్ర వేసిన కార్తీక్ దండు, ఇప్పుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'వృషకర్మ'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'విరూపాక్ష' ఆయనను సుకుమార్ శిష్య బృందం నుంచి వచ్చిన మరో ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిలబెట్టింది. వృషకర్మ (Vrushakarma) పై ఇప్పటికే మంచి బజ్ ఉంది.

ముఖ్యంగా పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది నాగచైతన్య కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా కూడా నిలవచ్చు. కానీ అసలు ప్రశ్న కంటెంట్ గురించే. బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల తమ తొలి సినిమాల మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయారు. మరి కార్తీక్ దండు 'వృషకర్మ'తో ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా, లేక సుకుమార్ మరో శిష్యుడు కూడా ఈ రెండో సినిమా ఒత్తిడికి బలవుతాడా? అనేది చూడాలి.


ఇవి కూడా చ‌ద‌వండి..

యూట్యూబ్‌లో.. దుమ్మురేపుతున్న నాగ‌దుర్గ కొత్త‌పాట

దర్శన్‌కు ఎదురుదెబ్బ‌.. అప్రూవర్ విచారణకు గ్రీన్ సిగ్నల్!

This Week OTT: ఈ వారం ఓటీటీల‌లో ప్ర‌సారమ‌య్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా

K. S. Chithra: తెలుగు వారు.. న‌న్ను అమ్మలా ఆదరిస్తున్నారు

Devara 2: ఫ్యాన్స్ వెయిటింగ్‌కు.. ఎండ్ కార్డ్? కథలో మార్పులకు.. ఓకే చెప్పిన తారక్?

Updated Date - Sep 29 , 2026 | 01:11 PM