సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pvr Vs Asian: పీవీఆర్‌కు తెలుగు నుంచి కొత్త సవాల్..? స్టార్ హీరోలతో ఏసియన్ నారంగ్ భారీ ప్లాన్!

ABN, Publish Date - Aug 04 , 2026 | 05:03 PM

ఏసియన్ గ్రూప్స్ పలువురు స్టార్ హీరోస్‌తో కలసి థియేటర్ బిజినెస్ లో విస్తరిస్తూ పోతోంది. చినుకులా రాలి నదులుగా సాగి అనే చందాన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వేరే స్టేట్స్ లోనూ ఏసియన్ సంస్థ తమ సినిమా థియేటర్స్ చెయిన్ ను పెంచుకుంటోంది. పీవీఆర్ తో ఏసియన్ ఢీ కొట్టగలదా అన్న చర్చ సాగుతోంది.. ఎందుకలాగా?.

pve asian

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏసియన్ గ్రూప్ థియేటర్స్ (Asian Group Theatres) పేరు విశేషంగా వినిపిస్తోంది. ఈ సంస్థ అధినేత సునీల్ నారంగ్ (Suniel Narang) పంపిణీ రంగంలో పేరున్న వారు, నిర్మాతగానూ స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతున్నారు. మ‌రోవైపు టాలీవుడ్ స్టార్స్‌తో కలసి సునీల్ నారంగ్ తన థియేటర్స్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. మహేశ్ బాబు (Mahesh Babu) తో కలసి 'ఏయమ్.బి. మల్టీప్లెక్స్స‌ (AMB Cinemas) నిర్మించారు. యన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన తారకరామా థియేటర్ ను రెన్నోవేషన్ చేసి ఏసియన్ తారకరామాగా మార్చారు. ఇక అల్లు అర్జున్ తో 'ట్రిపుల్ ఏ (AAA Cinemas) మల్టీప్లెక్స్, రవితేజ కాంబినేషన్ లో 'ఏ.ఆర్.టి. మల్టీప్లెక్స్ (ART Multiplex), విజయ్ దేవరకొండతో కలసి మహబూబ్ నగర్లో ఏవీడీ సినిమాస్ (AVD Cinemas) నిర్మించారు సునీల్. ఈ క్రమంలోనే త్వ‌ర‌లోనే జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్, రామ్ పోతినేని వంటి స్టార్స్ తోనూ ఏసియన్ నారంగ్ వేర్వేరుగా మల్టీప్లెక్స్ నిర్మిస్తారని తెలుస్తోంది. దీంతో మెల్లగా నారంగ్ తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ సంఖ్య పెంచుకుంటూ పోవచ్చుననీ వినిపిస్తోంది.

పీవీఆర్‌తో పోటీ..!

ప్రస్తుతం ఇండియాలో మల్టీప్లెక్స్ చెయిన్స్‌లో పీవీఆర్ (PVR Cinemas) సంస్థదే పైచేయిగా ఉంది. 'పీవీఆర్' ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 1700 మల్టీప్లెక్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఏసియన్ గ్రూప్ చేతిలో ఇప్పటి దాకా వందకు పైగా థియేటర్స్ ఉంటాయని సమాచారం. ప్రస్తుతం సునీల్ బెంగళూరులోనూ ఓ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారని వినికిడి. మెల్లగా ఒక్కో రాష్ట్రంలో సునీల్ తమ 'ఏసియన్ గ్రూప్'ను విస్తరిస్తూ పోతూ, 'పీవీఆర్'కే పోటీ ఇస్తారేమో అని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఆల్ ఇండియాలో పీవీఆర్ మల్టీప్లెక్స్ చెయిన్ నంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఇతర రాష్ట్రాల్లో పీవీఆర్ కు పోటీగా ఉన్న మల్టీప్లెక్స్ చెయిన్స్ ఏవంటే - సినీపాలిస్ ఇండియా, మిరాజ్ సినిమాస్, ముక్తా ఏ2, మూవీ టైమ్ సినిమాస్- ఉన్నాయి. సినీ పాలిస్ దేశంలోని 41 నగరాల్లో 491 స్క్రీన్స్ తో సాగుతోంది. ప్రస్తుతం 'పీవీఆర్'కు 'సినీ పాలిస్' ప్రధాన పోటీదారు. అయినప్పటికీ పీవీఆర్ చెయిన్‌తో పోలిస్తే 'సినీ పాలిస్' మూడో వంతు కూడా లేదు. ఈ తీరున 'పీవీఆర్'కు తెలుగు రాష్ట్రాల్లో 'ఏసియన్ గ్రూప్' గట్టి పోటీ ఇవ్వగలదని భావిస్తున్నారు.


అందుకేనా.. వెనుకడుగు..

ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ థియేటర్స్ యజమానులు తమకు 'రెంటల్ సిస్టమ్' ద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతోందని, 'పర్సంటేజ్ సిస్టమ్' అమలు చేయాలని సమ్మె చేశారు.. అప్పట్లో సింగిల్ థియేటర్స్ వారి పక్షాన నిలిచారు ఏసియన్ గ్రూప్ థియేటర్స్ అధినేత సునీల్ నారంగ్. ఆ తరువాత కొన్ని చర్చల వల్ల సమస్యను దాటవేశారే కానీ, సింగిల్ స్క్రీన్స్ కోరుకున్న పర్సంటేజ్ సిస్టమ్ అయితే అమలులోకి రాలేదు. మల్టీప్లెక్స్ చెయిన్ ను విస్తరిస్తూ పోతోన్న సునీల్ తన బిజినెస్ కోసం ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఓనర్స్ డిమాండ్‌కు మద్దతు పలకడం లేదనీ తెలుస్తోంది. ఇలా సునీల్ వెనక్కి తగ్గడంపై చర్చ సాగుతోంది. అయితే సునీల్ మాత్రం తన మల్టీప్లెక్స్ సంఖ్య పెంచుకొనేందుకు స్టార్స్ తో చేతులు కలుపుతున్నారు. వచ్చే యేడాదిలోగా దేశవ్యాప్తంగా సునీల్ ఎన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో భాగస్వామి అవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

వరుస ఆఫర్లు.. మళ్లీ DSP ఫామ్‌లోకి వచ్చేసినట్టేనా?

తారక్ ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోయిందా? అసలు విషయం ఏంటంటే

NBK112: అందుకు నో.. కొరటాల ప్లాన్ మారింది

Updated Date - Aug 04 , 2026 | 05:17 PM