Vishnu Priya: ఆ వీడియో లీక్.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా

ABN , Publish Date - Oct 31 , 2025 | 09:36 PM

అందాల హాట్ బ్యూటీ విష్ణు ప్రియ (Vishnu Priya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Vishnu Priya

Vishnu Priya: అందాల హాట్ బ్యూటీ విష్ణు ప్రియ (Vishnu Priya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోవే పోరా అనే షోకు యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన విష్ణు.. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఇక అదే గుర్తింపుతో జబర్దస్త్ నటులతో కలిసి షోస్ చేస్తూ మరింత పేరు సంపాదించుకుంది. అలా బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా అమ్మడు మంచి పేరు సంపాదించుకుంది.

ఇక ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 8 కి వెళ్లి.. నిజాయితీగా ఉండి ఎంతోమంది అభిమానాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క షోస్ తో బిజీగా ఉన్న విష్ణు సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు కొదువ లేకుండా చేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. అయితే అమ్మడి జీవితంలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విష్ణు ప్రియ అసభ్యకరమైన వీడియోలు లీక్ అయ్యాయి.

మొట్ట మొదటిసారి ఒక టాక్ షోలో ఆ వీడియో లీక్స్ గురించి విష్ణు స్పందించింది. ఆ సమయం తనకు ఎంతో నరకంగా అనిపించిందని, చనిపోవాలనుకున్నాను అంటూ ఎమోషనల్ అయ్యింది. " నా ముఖాన్ని మార్ఫ్ చేసి వీడియో రిలీజ్ చేశారు. వాట్సాప్ డాక్యుమెంటరీలో పంపించారు. వాటిని చూసి అందరూ నేనే అనుకున్నారు. ఒక్కరు కూడా నన్ను నమ్మలేదు.

ఇక ఆ సమయంలోనే నా ఫేస్ బుక్ కూడా హ్యాక్ అయ్యింది. అందులో కూడా అశ్లీల పోస్టులు. మా తాతయ్య.. అమ్మకు ఫోన్ చేసి ఏంటి విష్ణు అలాంటి పోస్టులు పెడుతుంది అని అడిగేవారు. అబ్బాయిలు అయితే నేను ఎక్కడకు వెళ్లినా ఆ వీడియో గురించే మాట్లాడేవారు. మీ వీడియో చూసాము అని డైరెక్ట్ గా చెప్పేవారు. మా అమ్మ నాకు ధైర్యం ఇవ్వడం వలన నేను ఇలా ఉండగలిగాను.. లేకపోతే ఎప్పుడో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విష్ణు ప్రియ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్ ఎంగేజ్ మెంట్.. హాజరైన మెగా ఫ్యామిలీ

Nara Brahmani: నాన్న నటన వారసత్వంగా వచ్చింది.. చెల్లి యాక్టింగ్ పై అక్క ప్రశంస


Updated Date - Oct 31 , 2025 | 09:37 PM