సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తాత జయంతి వేళ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం

ABN, Publish Date - Oct 01 , 2026 | 04:24 PM

తనకు ఎంతో ఇష్టమైన తాత, హాస్య దిగ్గజం పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి (అక్టోబర్ 1) సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Allu Family Photo

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) తన కెరీర్‌లో మరో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తనకు ఎంతో ఇష్టమైన తాత, హాస్య దిగ్గజం పద్మశ్రీ అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) జయంతి (అక్టోబర్ 1) సందర్భంగా బన్నీ తన నూతన క్రియేటివ్ ఆఫీస్ స్పేస్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ వినూత్న వర్క్‌స్పేస్‌కు ‘ఐకాన్జా’ (ICONZA) అని నామకరణం చేశారు.


ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఒక సరికొత్త ఆఫీస్.. ఒక సరికొత్త ఆరంభం. మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం’’ అంటూ పోస్ట్ చేశారు. అల్లు వారి వారసత్వాన్ని, సినీ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ క్రియేటివ్ ఆఫీస్ రూపుదిద్దుకుంది. సినిమా కథా చర్చలు, కొత్త కాన్సెప్టుల డెవలప్‌మెంట్, భవిష్యత్ ప్రాజెక్టుల ప్రణాళికల కోసం అత్యంత అత్యాధునిక హంగులతో ‘ఐకాన్జా’ను తీర్చిదిద్దినట్లు సమాచారం.


ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న అల్లు అర్జున్ లైనప్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప 2: ది రూల్’ సృష్టించిన ప్రభంజనం తర్వాత.. ఆయన తదుపరి చిత్రంగా రానున్న క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’ (Raaka)పై అందరి దృష్టీ పడింది. భారీ స్థాయి యాక్షన్ అండ్ ఎమోషనల్ అంశాలతో సిద్ధమవుతున్న ‘రాకా’తో పాటు మరిన్ని ప్రతిష్టాత్మక చిత్రాల సన్నాహక పనులు ఇప్పుడు ‘ఐకాన్జా’ కేంద్రంగా శరవేగంగా ఊపందుకోనున్నాయి. నిజంగా ఇది అల్లు అభిమానులకు సంతోషాన్ని కలిగించే వార్తే అని చెప్పుకోవచ్చు. అలాగే, అల్లు అర్జున్‌కు సంబంధించి, ఆయన ఈ మధ్యకాలంలో తీసుకునే నిర్ణయాలతో అంతా ఆశ్చర్యపోతున్నారంటే అతిశయోక్తి కానే కాదు. మొత్తంగా అయితే.. అల్లు అర్జున్ భారీ ప్లానింగ్‌తోనే ఇదంతా చేస్తున్నారనే విషయం మాత్రం అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి:

కన్యత్వం చుట్టూ తిరిగే బోల్డ్ కథతో సినిమా.. సమంత బంగారమే స్ఫూర్తట

ఈ వారం మూడు కొత్త సినిమాలు.. ఈ ఓటీటీలో ఫ్రీగా చూసేయండి

ఫెడరేషన్ అధ్యక్షుడిపై జానీ మాస్టర్ వైఫ్ సుమలత యుద్ధం మొదలు

Updated Date - Oct 01 , 2026 | 04:24 PM