విద్యుత్ జమ్వాల్ 15 నిమిషాల శ్వాస నియంత్రణ ధ్యానం

ABN , Publish Date - Oct 07 , 2026 | 02:12 PM

ముంబైలో జరిగిన స్ట్రీట్ ఫైటర్ సినిమా కార్యక్రమంలో విద్యుత్ జమ్వాల్ 15 నిమిషాల పాటు శ్వాసను నియంత్రిస్తూ ధ్యానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Street Fighter Movie

ముంబైలో జరిగిన ఆంగ్ల చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదికపై వరుసగా 15 నిమిషాల పాటు శ్వాసను నియంత్రిస్తూ ధ్యానం చేశారు. ధల్సిమ్ పాత్రలో నటిస్తున్న విద్యుత్ జమ్వాల్‌ యోగా, కలరిపయట్టు వంటి భారతీయ కళల్లో తనకు ఉన్న నైపుణ్యాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. హాలీవుడ్‌లో విద్యుత్ జమ్వాల్‌కు ‘స్ట్రీట్ ఫైటర్’ తొలి చిత్రం. ఇందులో ఆయన ప్రముఖ గేమింగ్ క్యారెక్టర్ ధల్సిమ్ పాత్రను పోషిస్తున్నారు. యోగ సాధకుడైన విద్యుత్‌ జమ్వాల్‌ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి నిరూపించారు.


ధల్సిమ్ వేషధారణలో ఉన్న కాస్ప్లేయర్లతో కలిసి విద్యుత్ ఈ వేదికపై 15 నిమిషాల పాటు మౌనంగా ధ్యానం చేశారు. అనంతరం తాను పతంజలి యోగసూత్రాల్లోని ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించానని తెలిపారు. ఈ టెక్నిక్ ద్వారా 15 నిమిషాల పాటు శ్వాసను నియంత్రించడంతో పాటు జీవితంలో ఎన్నో లక్ష్యాలను సాధించగలిగానని చెప్పారు. ఈ పద్ధతిని యువతకు కూడా నేర్పిస్తున్నట్లు వెల్లడించారు.

'నేటి యువతకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఏదో ఒకటి సాధించేందుకు అందరూ పరుగులు తీస్తున్నారు. కానీ ఒక్కసారి ఆగి, ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి. ఏమీ చేయకుండా కొంత సమయం ఉండండి. ఈ నైపుణ్యం మిమ్మల్ని జీవితంలో చాలా దూరం తీసుకెళ్తుంది. లక్ష్యాలను సాధించడానికి సమయం పడుతుంది. కానీ పట్టుదలతో కొనసాగితే తప్పకుండా విజయం సాధించవచ్చు' అని విద్యుత్ జమ్వాల్ అన్నారు. పారామౌంట్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘స్ట్రీట్ ఫైటర్’ చిత్రం 2026 అక్టోబర్ 16న భారత్‌లో ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

అభిమాని హ‌త్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్

ధనుష్ కొత్త పార్టీ.. 'తమిళగ ఎళుచ్చి కళగం'? ఈసీ వద్ద నమోదు!

నిన్న రాజశేఖ‌ర్.. నేడు విజ‌య శాంతి! అస‌లు బాల‌య్య‌తో.. ఏం ఫ్లాన్ చేస్తున్నావ్ శివ‌య్య

Updated Date - Oct 07 , 2026 | 02:15 PM

అభిమాని హ‌త్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్

‘అనకాపల్లి’ సినిమాకు.. థియేటర్లు ఇవ్వకపోవడం బాధగా ఉంది

‘సరిపోయారు ఇద్దరూ’ టీజర్

గాయ‌ని పి. సుశీలకు.. ఘన పౌర సన్మానం

బోయ‌పాటి దృష్టంతా.. ఆ హీరోపైనే