టాలీవుడ్‌లో శ్రీలీల చాప్టర్ క్లోజా?
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:15 PM
సినిమా రంగంలో అదృష్టం ఎప్పుడు ఎవరి వైపు ఉంటుందో చెప్పడం ఎవరివల్లా కాదు. ఒక్క హిట్ పడితే స్టార్‌డమ్ వచ్చేస్తుంది.. వరుస ప్లాప్‌లు వస్తే వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.
సినిమా రంగంలో అదృష్టం ఎప్పుడు ఎవరి వైపు ఉంటుందో చెప్పడం ఎవరివల్లా కాదు. ఒక్క హిట్ పడితే స్టార్‌డమ్ వచ్చేస్తుంది.. వరుస ప్లాప్‌లు వస్తే వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి నిరంతరం శ్రమించాల్సిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్సింగ్ సెన్సేషన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీలీల (Sreeleela) కెరీర్ ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపు తిరుగుతోంది. ఇండస్ట్రీ వరుస అవకాశాలు దక్కించుకున్నప్పటికీ, సక్సెస్ రేటు మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. ప్రస్తుతం ఆమె కెరీర్ టాలీవుడ్‌లో క్లోజ్ అయినట్లుగానే భావించవచ్చు.
తెలుగు తెరపై స్టార్ హీరోల సరసన నటించి కుర్రకారును ఊపిన ఈ ముద్దుగుమ్మ శ్రీలల, కెరీర్ గ్రాఫ్ తగ్గుతున్న సమయంలో తమిళ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అయితే కోలీవుడ్‌లోనూ ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, శ్రీలీల తన రూటును పూర్తిగా మార్చేసింది. సౌత్ ఇండస్ట్రీని దాటి నేరుగా బాలీవుడ్ బాట పట్టాలని నిర్ణయించుకుంది. రెండేళ్ల క్రితమే బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాల్సిన శ్రీలీల చదువు కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక డాక్టర్ చదువు పూర్తి కావడంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే ఈ సారి పూర్తి స్థాయిలో బాలీవుడ్ సినిమాపై ఫోకస్ పెట్టింది. దీంతో హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చేసింది. ముంబై నగరంలో ఇప్పటికే ఒక లగ్జరియస్ ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు సమాచారం. అక్కడి నుంచే తన భవిష్యత్తు చిత్రాలపై దృష్టి పెట్టాలని భావిస్తోందట.
ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తూ.. హిందీ చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఉత్తరాది చిత్రసీమలో శ్రీలీలకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. హిందీ నేల మీద తన అదృష్టాన్ని పూర్తిగా పరీక్షించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. టాలీవుడ్‌లో ఒకప్పుడు ఉరుకులు పరుగులతో సాగిన ప్రయాణం, ఇప్పుడు ముంబై వీధుల్లో కొత్త మజిలీకి చేరుకుంది. సౌత్ ప్రాజెక్ట్‌లను క్రమంగా తగ్గిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ, ఇకపై పూర్తిగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ముంబై గడ్డపై ఈ డ్యాన్సింగ్ క్వీన్ తన హవాను ఏ స్థాయిలో చాటుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘రామాయణ’ దండయాత్రకు అడ్డుగా గాడ్జిల్లా.. ఊహించలేదు కదా!
అతనితో రిలేషన్ వర్కవుట్ కాలేదు.. ఆ తర్వాత ఎవరితో కమిట్ కాలేదు: కావ్యశ్రీ
‘మండాడి’కి యుబైఏ.. విడుదలకు సిద్ధం