హాలీవుడ్ దర్శకుడిని ఆకర్షించిన మహేష్ తనయుడు.. ఏం జరుగుతోంది
ABN, Publish Date - Jul 12 , 2026 | 09:24 PM
టాలీవుడ్‌లో ప్రస్తుతం సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. నెక్ట్స్ జనరేషన్ స్టార్ కిడ్స్ వెండితెర అరంగేట్రం కోసం యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ తనయుడికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.
టాలీవుడ్‌లో ప్రస్తుతం సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. నెక్ట్స్ జనరేషన్ స్టార్ కిడ్స్ వెండితెర అరంగేట్రం కోసం యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ దాదాపు ఖరారు కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) ఎప్పుడు హీరోగా కనిపిస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. వీరిద్దరితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ (Gautham Krishna) ఎంట్రీ కోసం కూడా ఘట్టమనేని అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు కొడుకు (Super Star Mahesh Babu Son) గౌతమ్ కృష్ణకు సంబంధించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
తాజాగా ముంబై నగరంలో హాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ (The Odyssey) ప్రీమియర్ వేడుక చాలా అట్టహాసంగా జరిగింది. ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్‌కు చిత్ర దర్శకుడు, గ్లోబల్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్‌తో పాటు ఎంతో మంది అంతర్జాతీయ హాలీవుడ్ నటులు హాజరయ్యారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వేదికపై సూపర్ స్టార్ వారసుడు గౌతమ్ కృష్ణ మెరవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వేడుకలో గౌతమ్ కృష్ణ ఆన్ బ్లాక్ సూట్ ధరించి, ఎంతో స్టైలిష్‌గా, రాయల్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. గౌతమ్ లుక్, అతని మేనరిజం చూస్తుంటే అచ్చం మహేష్ బాబులానే ఉన్నాడంటూ, తండ్రిని పోల్చుతూ అభిమానులు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.
గౌతమ్ కృష్ణకు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించే సినిమాలంటే విపరీతమైన పిచ్చి, అందుకే ఆయనపై ఉన్న వీరాభిమానంతోనే ముంబైలో జరిగిన ‘ది ఒడిస్సీ’ వేడుకలో గౌతమ్ ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు అంతర్జాతీయ మార్కెట్‌ను ఏలుతున్న తరుణంలో, ఈ గ్లోబల్ ఈవెంట్‌లో గౌతమ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవడం వెనుక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా అనే చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో క్రిస్టోఫర్ నోలన్ తీయబోయే సైన్స్ ఫిక్షన్ లేదా యాక్షన్ డ్రామాలో గౌతమ్ భాగమయ్యే అవకాశం ఉందంటూ కొందరు సినీ విశ్లేషకులు, ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, హీరోగా మొదటి సినిమానే ఈ హాలీవుడ్ క్రేజీ దర్శకుడి ప్రాజెక్ట్‌తో గ్లోబల్ లెవెల్‌లో అరంగేట్రం చేస్తే వచ్చే కిక్కే వేరంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరగబోతోందో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
నేనెంత దురదృష్టవంతురాలినో మాటల్లో చెప్పలేను: కౌసల్య
విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్! ‘జననాయగన్’ మళ్లీ వాయిదా..
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీమ్స్ మధ్య ఘర్షణ.. సభ్యుల విజ్ఞప్తి ఇదే