రస్సెల్ బ్రాండ్‌కు పదిన్నరేళ్ల జైలు శిక్ష!

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:07 PM

హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్‌కు యూకే కోర్టు పదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన లైంగిక నేరాలకు సంబంధించిన ఆరు కేసుల్లో నాలుగింటిలో ఆయన దోషిగా తేలారు. శిక్షలో మూడింట రెండు వంతులు పూర్తి చేసిన తర్వాత లైసెన్స్‌పై విడుదలయ్యే అవకాశం ఉంది.

Russell Brand

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు రస్సెల్‌ బ్రాండ్‌ కు యూకే కోర్టు పదిన్నరేళ్ళ జైలు శిక్ష విధించింది. 'ఇరవై యేళ్ళ క్రితం రస్సెల్‌ బ్రాండ్‌ లైంగక నేరాలకు పాల్పడ్డాడని కోర్టు నిర్థారణకు వచ్చింది. యుక్తవయసులో మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేని రస్సెల్ బ్రాండ్‌ ఓ మహిళపై అత్యాచారం చేయడంతో పాటు మరో ముగ్గురిపై లైంగికపరమైన దాడికి పాల్పడ్డాడని కోర్టు నిర్ధారించింది. దాంతో ఆయనపై సోమవారం తీర్పు వెలువడింది. ఎనిమిదిమంది పురుషులు, నలుగురు మహిళా జడ్జీలు ఉన్న బెంచ్‌ ఈ తీర్పును ఇచ్చింది. రస్సెల్ బ్రాండ్‌పై ఉన్న ఆరు కేసులకు గానూ నాలుగింటిలో ఆయన దోషిగా నిర్ధారితమయ్యారు.


రియాలిటీ టెలివిజన్ షో 'బిగ్ బ్రదర్స్ బిగ్‌ మౌత్‌'కు హోస్ట్ గా వ్యవహరించిన రస్సెల్‌ ఎడ్వర్డ్ బ్రాండ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. 2007లో రస్సెల్‌ 'సెయింట్‌ ట్రినియన్స్' చిత్రంలో కీలకమైన పాత్రను పోషించారు. ఆ తర్వాత ఆయన అనేక హాలీవుడ్‌ చిత్రాలలో నటించారు. మూడు బ్రిటిష్ కామెడీ అవార్డులతో పాటు బాఫ్టా అవార్డుకు నామినేషన్ పొందారు. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన జీవితంలోని వివాదాస్పద చర్యలు, నిర్ణయాల వల్ల ఆయన తరచూ వార్తలలో నానుతుండేవారు. తాజాగా పడిన శిక్షలో మూడింట రెండు వంతులు అనుభవించిన తర్వాత లైసెన్స్‌పై రస్సెల్‌ విడుదలయ్యే ఆస్కారం ఉంది.

ఇవి కూడా చదవండి:

మూడోసారి విడాకులు?.. పవన్ కళ్యాణ్ మరో యుద్ధం చేయాల్సిందే

సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్స్.. మరో హిట్ రాసిపెట్టుకోండమ్మా

విజయ్ సేతుపతి జైత్రయాత్ర.. వరుస రిలీజ్‌లతో ఫుల్ బిజీ

Updated Date - Nov 10 , 2026 | 01:13 PM

DNK Trailer: ఈ ఏడాదిలో మోస్ట్ చిల్లర సినిమా ఇదే

చిరు లీక్స్‌లా లీక్స్ ఇవ్వను.. ‘కాకా’ సంక్రాంతికే: రామ్ చరణ్

రోషన్ మేక.. 'జటాయు'కి ముహూర్తం ఫిక్స్

నయన్ కి ఇది పెద్ద అవమానమే..

Varanasi OTT: ఆ ఓటీటీకి రాజమౌళి షాక్.. వారణాసి కోసం కొత్త ప్లాన్!