DNK Trailer: ఈ ఏడాదిలో మోస్ట్ చిల్లర సినిమా ఇదే

ABN , Publish Date - Nov 09 , 2026 | 09:44 PM

కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియాని షేక్ చేసి లిటిల్ హార్ట్స్ సినిమాతో ఓవర్ నైట్ హీరోగా మారాడు మౌళి తనూజ్(Mouli). ఇక ఈ సినిమా ఇచ్చిన విజయంతో టాప్ ప్రొడక్షన్ హౌస్ లు అతని ముందు క్యూ కట్టాయి.

Donga Naa Koduku

కంటెంట్ క్రియేటర్ గా సోషల్ మీడియాని షేక్ చేసి లిటిల్ హార్ట్స్ సినిమాతో ఓవర్ నైట్ హీరోగా మారాడు మౌళి తనూజ్(Mouli). ఇక ఈ సినిమా ఇచ్చిన విజయంతో టాప్ ప్రొడక్షన్ హౌస్ లు అతని ముందు క్యూ కట్టాయి. తాజాగా టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ‘దొంగ నా కొడుకు’ (DNK - Donga Naa Koduku). మౌళి, సుస్మితా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా DNK ట్రైలర్ ని మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం క్రింజ్ పంచ్ లతో నింపేశారు. టీజర్ లో మౌళి.. తన చంకలో పౌడర్ కొట్టుకొని దాన్ని ముఖానికి అద్దుకోవడమే పరమ క్రింజ్ అని విమర్శలు వచ్చాయి. ఇక ట్రైలర్ లో అంతకు మించిన డైలాగ్స్ ని పెట్టేశారు. హీరో ఒక దొంగ నా కొడుకు. పనీపాటా ఏమి లేకుండా ఫ్రెండ్ తో బలాదూర్ తిరుగుతూ ఉంటాడు. అతనికి ఆన్ లైన్ బెట్టింగ్స్ అంటే పిచ్చి. ఉన్న డబ్బు మొత్తం బెట్టింగ్స్ లో పెట్టి నాశనం చేస్తాడు. చివరికి లవర్ దగ్గర ఉన్న బంగారం అమ్మి ఆ అప్పులు తీరుస్తాడు. ఈ విషయం లవర్ పేరెంట్స్ కి తెలిసి.. నెలలోపు డబ్బు కట్టమని గొడవ చేయడంతో.. ఫ్రెండ్ తో కలిసి గుండు బాస్ జ్యూవెలరీ షాప్ లో దొంగతనం చేస్తాడు. ఆ తరువాత వీరిద్దరి తలరాత మారిపోతుంది. పోలీసులు ఆ రాబరీ చేసినవారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి చివరికి ఈ దొంగ నా కొడుకు పోలీసులకు చిక్కాడా.. ? ఆ బంగారం ఏమైంది.. ? అసలు హీరో మారతాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


ఈ చిత్రం పూర్తిగా విశాఖపట్నం నేపథ్యంగా సాగే క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేటి తరం కుర్రాళ్లు.. ఆ తర్వాత ఎలాంటి గందరగోళం, కామెడీ పరిస్థితులు నెలకొన్నాయి అనే అంశాలను దర్శకుడు శ్రీను కంబాల ఎంతో వినోదాత్మకంగా ట్రైలర్‌లో చూపించాడు. అయితే డైలాగ్స్, మౌళి నటన చాలా క్రింజ్ గా ఉన్నాయి. ట్రైలర్ లోనే ఇది ఈ ఏడాదిలో చాలా చిల్లర సినిమా అని కూడా చెప్పేశారు. యూత్‌ఫుల్ కంటెంట్‌కు ఫుల్ కామెడీ ఎలిమెంట్స్ తోడవ్వడం ఈ సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తోంది. సినిజిత్ యెర్రామిల్లి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లలోని హ్యూమర్‌ను, థ్రిల్‌ను ఎలివేట్ చేసింది. ఈ చిత్రం నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ క్రైమ్-కామెడీ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

Updated Date - Nov 09 , 2026 | 10:02 PM