‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు.. డాక్టర్ డూమ్ విశ్వరూపం!
ABN , Publish Date - Nov 03 , 2026 | 02:55 PM
మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రం నుంచి ఐదు కొత్త పోస్టర్లను విడుదల చేసింది. డాక్టర్ డూమ్ ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ సినిమా డిసెంబర్ 17, 2026న భారతదేశంలో విడుదల కానుంది.
మార్వెల్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి 5 కొత్త పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లలో మార్వెల్ సినీ విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుల్లో ఒకరైన డాక్టర్ డూమ్‌ను ప్రధానంగా చూపించారు. భారీ తారాగణం, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. మార్వెల్ సినిమాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది అతిపెద్ద సినీ వేడుకల్లో ఒకటిగా నిలవనుంది.

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రం 2026 డిసెంబర్ 17న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 4DX, RealD 3D, ScreenX, Dolby, మార్వెల్ స్టూడియోస్ అందిస్తున్న ఇన్ఫినిటీ విజన్ వంటి ప్రీమియం ఫార్మాట్లలోనూ ఈ సినిమాను చూడొచ్చని మేకర్స్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Ritika Singh: నా పేరుతో.. నాకు తెలియకుండానే సబ్ స్క్రిప్షన్ రూ.400 వసూలు చేస్తున్నారు
Mahesh Babu: గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు.. షార్ట్ గన్ గేమ్స్‌లో పెట్టుబడి!
Sundar C: నిజాలు తెలుసుకోకుండా.. వార్తలు రాయడం బాధిస్తుంది