సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'తెల్ల కాగితం' సినిమా ఎలా ఉందంటే..

ABN, Publish Date - Oct 02 , 2026 | 01:25 PM

అక్టోబర్‌ మొదటివారం అంతా చిన్న సినిమాల సందడే ఎక్కువుంది. పెద్ద సినిమాలేమీ విడుదలకు లేకపోవడంతో దాదాపు 8 సినిమాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో హర్ష్‌ రోషన్‌, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్ల కాగితం’ ఒకటి. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల్ని ఏ మాదిరి ఆకట్టుకుంది అన్నది చూద్దాం.

సినిమా రివ్యూ: ‘తెల్ల కాగితం’ (Thella Kagitham)
విడుదల తేది: 2-10-2026


అక్టోబర్ మొదటి వారమంతా చిన్న సినిమాల సందడే ఎక్కువ. పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడంతో దాదాపు 8 చిన్న సినిమాలు శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్ల కాగితం’ ఒకటి. అజయ్, దీపక్, శరణ్య, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రధారులు. రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతలా ఆకట్టుకుంటుందో చూద్దాం.

కథ: (Thella Kagitham)
రాము (హర్ష్ రోషన్) మిడిల్ క్లాస్ కుర్రాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నావదిన అతని బాధ్యత తీసుకుని చదివిస్తుంటారు. ఆశా (నక్షత్ర) కాస్త ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన అమ్మాయి. తండ్రి మూర్తి (అజయ్) చాలా స్ట్రిక్ట్. తను తప్పు చేయడు.. ఎవరైనా తప్పు చేస్తే సహించడు. యుక్త వయసుల్లో ఉన్న రాము, ఆశ మంచి స్నేహితులు. కొన్నాళ్లకే ఒకరి మీద ఒకరు ఇష్టం పెంచుకుని ప్రేమలో పడతారు. టీనేజ్ ఎట్రాక్షన్ తో పాటు తమ ప్రేమ ఎక్కడ దూరం అవుతుందనే భయం ఓ వైపు పీడిస్తుంటే… కసిరెడ్డి రాజ్ కుమార్ ఇచ్చిన సలహాతో రాము ఓ అడుగు ముందుకేసి ఆశాతో తప్పటడుగు వేస్తాడు. దాంతో ఈ యువ జంట జీవితాలు తలకిందులు అయిపోతాయి. కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏమవుతుందనే భయంతో ఎదురైన సవాళ్ళ ను ఎదుర్కొని ఏం చేశారు? అన్నదే కథ.

విశ్లేషణ..

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిన్న ప్రేమకథ ఇది. యుక్త వయసులో ఉన్న ఓ జంట చేయకూడని తప్పు చేసి ఎలాంటి ఇబ్బందులకు గురయింది. ఫైనల్ గా ఏం తెలుసుకుందన్నదే ఈ సినిమా లైన్. రాము, ఆశాల స్కూల్ డేస్తో మొదలైన కథ.. ఆకర్షణ, ప్రేమ వైపు టర్న్ తీసుకుంటుంది. అప్పటి వరకూ సరదాగా సాగిన వారి ప్రేమ కథ... వయసు తొందరలో ప్రేమించిన అమ్మాయి మరొకరికి ఆకర్షితురాలు అవుతుందనే భయం.. ఆ తర్వాత చేసిన తప్పు ఫలితం వరకూ సరదాగా, ఇంటెన్స్ గా నడుస్తుంది. ద్వితీయార్థంలో ఆ సమస్య నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు. ల్యాగ్ గా ఉండి పరమ రొటీన్ గా సాగుతాయి. సెకెండాఫ్ ఆల్మోస్ట్ ప్రిడిక్ట్ చేసేలా ఉంటుంది. చివర్లో హీరో సోదరుడికి, హీరోయిన్ తండ్రికి మధ్య సాగిన సంభాషణలు మాత్రం కాసింత ఆలోచింపచేస్తాయి.


నటీనటులు.. సాంకేతిక నిపుణులు పనితీరు..
హర్ష్ రోషన్ తన వయసుకి సరిపడే పాత్రలే ఎంచుకుంటున్నాడు. అయితే అవి అతన్ని మరో మెట్టు ఎక్కనివ్వడం లేదు. వయసుకి సరిపోయే కథలే అయినా.. రొటీన్ ఫార్ములా కథలు కావడం పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. కాకుంటే ఇందులో రాము పాత్రకు న్యాయం చేశాడు. కొత్త నటి నక్షత్ర ఆశా పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. అందంతోపాటు హావభావాలతో ఆకట్టుకుంది. ప్రతి సీన్లో మెచూర్డ్ యాక్టింగ్ కనిపించింది. ఆమె తండ్రి పాత్రలో అజయ్ కూడా బాగా చేశాడు. హర్ష్ స్నేహితుడిగా నటించిన దీపక్ చక్కని వినోదాన్ని పండించాడు. కసిరెడ్డి రాజకుమార్ పాత్ర రొటీన్ గా ఉంది. ఫస్టాప్ అంతా ఫన్రైడ్లా సాగింది. సెకండాఫ్లో భావోద్వేగాలు ఉన్నప్పటికీ సీన్ టు సీన్ ఏం జరుగుతుందో ఊహించేలా ఉండటం మైనస్ అయింది. చిన్న బడ్జెట్ చిత్రాలకు క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చే విజయ్ బుల్గానిన్ తన ట్యూన్స్ తో ఆకట్టుకున్నాడు. తను అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలకు కెమెరా పనితనం ఎంతో ముఖ్యం. కె.వి. గుహన్ ఈ విషయంలో తన ప్రతిభను చాటుకున్నాడనే చెప్పాలి.. ఈ మధ్య యువత టార్గెట్ గా వస్తున్న చాలా చిత్రాలు దాదాపు ఈ తరహా కథాంశంతోనే తెరకెక్కాయి. చెడు స్నేహాల వల్ల యువత ఎలాంటి తప్పులు చేస్తున్నారు.. జీవితంలోని ఏం కోల్పోతున్నారు అన్న అంశాలను చూపిస్తూనే చివర్లో ఓ సందేశంతో ముగిస్తున్నారు. ‘తెల్ల కాగితం’ మూవీది ఇదే ఫార్మెట్. అందుకే ఈ తెల్లకాగితం తన స్వచ్ఛతను చాటుకోలేక పోయింది.

ట్యాగ్ లైన్: మచ్చ పడిన 'తెల్ల కాగితం'
రేటింగ్: 2.25/5

Updated Date - Oct 02 , 2026 | 03:44 PM