సినిమా రివ్యూ: అనకాపల్లి

ABN , Publish Date - Oct 03 , 2026 | 06:53 AM

ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ కుమారుడు విక్రమ్‌ సహిదేవ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'అనకాపల్లి’. సంధ్యా వశిష్ట కథానాయిక. దర్శకుడు త్రినాథ రావు నక్కిన ఇంద్రజ, తారక్‌ పొన్నప్ప, వడ్లమాని శ్రీనివాస్‌ కీలక పాత్రధారులు. కాగేష్‌ తమ్మినేని దర్శకత్వం వహించారు శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో సాగిన లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందో చూద్దాం...

సినిమా రివ్యూ: అనకాపల్లి (Anakapalli Review)
విడుదల తేది: 2–10–2026

 
ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్‌ కుమారుడు విక్రమ్‌ సహిదేవ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం 'అనకాపల్లి’. సంధ్యా వశిష్ట కథానాయిక. దర్శకుడు త్రినాథ రావు నక్కిన ఇంద్రజ, తారక్‌ పొన్నప్ప, వడ్లమాని శ్రీనివాస్‌ కీలక పాత్రధారులు. భవ్యశ్రీ మూవీ మేకర్స్‌, నక్కిన నెరేటివ్స్‌ పతాకాలపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. కాగేష్‌ తమ్మినేని దర్శకత్వం వహించారు శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. గ్రామీణ నేపథ్యంలో సాగిన లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందో చూద్దాం...


కథ
అనకాపల్లి ప్రాంతంలో సాగే కథ ఇది. అక్కడ సూర్య (విక్రమ్‌ సహిదేవ్‌) చదువు పూర్తి చేసి ఆడుతూపాడుతూ సరదాగా గడిపే మధ్య తరగతి కుర్రాడు. తన తండ్రి సాంబశివరావు (త్రినాధరావు) కరెంట్‌ ఆఫీస్‌లో నిజాయతీ గల ఉద్యోగి. అనకాపల్లి ఏరియాలో  బుల్లెట్‌ (తారక్‌ పొన్నప్ప) పేరు చెబితే జనాలకు హడల్‌. అదే ప్రాంతంలో డ్రగ్స్‌ వ్యాపారం చేసే నాయుడితో (కాండ్రేగుల నాయుడు)తో బుల్లెట్‌కు  ఏదో ఒక గొడవ వస్తుంటుంది.  సూర్యకు బుల్లెట్‌ పరిచయమవుతాడు. మిడిల్‌ క్లాస్‌ జీవితం నచ్చని సూర్య బుల్లెట్‌ అనుచరుల్లో ఒకడిగా మారి అతనికి రైట్‌ హ్యాండ్‌గా మారతాడు. డ్రగ్స్‌ వ్యాపారంలో గొడవలు రావడంతో ఇద్దరు కలిసి ఎమ్మెల్యే ( వడ్లమాని శ్రీనివాస్‌) అనుచరుడు నాయుడిని మర్డర్‌ చేస్తారు. బుల్లెట్‌కు రైట్‌ హ్యాండ్‌గా ఉన్న సూర్య కొన్నాళ్లకు అతనికి ఎదురు తిరుగుతాడు. సూరి ఎందుకు అలా చేశాడు? తొలి చూపులోనే  ఇష్టపడ్డ అమృత ( సంధ్య వశిష్ట)తో సూరి ప్రేమాయణం ఎలా సాగింది. సూర్యను ప్రేమించిన అమృత బుల్లెట్‌తో సినిమాకు ఎందుకు వెళ్లింది? బుల్లెట్‌కు సూర్య ఎదురు తిరగడానికి కారణమేంటి? ఫైనల్‌గా ఆ అమ్మాయిని తన సొంతం చేసుకున్నాడా? అన్నది కథ.


విశ్లేషణ:
హీరో ఎంతగానో ప్రేమించిన అమ్మాయి విలన్‌ ప్రేమించడం.. అసలు ఆ అమ్మాయి అలా (ట్విస్ట్‌) ఎందుకు చేసింది అన్న ఇతివృత్తంతో సాగే విలేజ్‌ యాక్షన్‌ లవ్‌స్టోరీ ఇది.ఈ తరహా కథ తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అయితే దీనికి కుటుంబ భావోద్వేగాలు, డ్రగ్స్‌ మాఫియాను జోడించి దర్శకుడు కాస్త ఆసక్తికరంగా రూపొందించారు. ఫస్టాఫ్‌ అంతా సూరి బుల్లెట్‌కు అనుచరుడిగా మారడం, సంధ్యతో ప్రేమాయణం.. ఇలా సరదా సన్నివేశాలతో సాగిపోయింది. అయితే అమ్మాయితో ఆకట్టుకోవడానికి ప్రేమలో దించడానికి హీరో చేసిన ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోవు. ఏ ప్రేమకథలో అయినా ఇదే ఫార్మెట్‌ ఉంటుంది. రెగ్యులర్‌గా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసి ఉంటే బాగుండేది. సూర్య తన ప్రేమను అమ్మాయికి ఎక్స్‌ప్రెస్‌ చేసే సమయానికి ఓ ట్విస్ట్‌. దాంతో రొటీన్‌ ట్రాక్‌ నుంచి కథ ఇంట్రెస్టింగ్‌ ట్రాక్‌లోకి వెళ్లింది. అక్కడితో విరామం. సెకండాఫ్‌ అంతా ఎమోషన్‌, రివెంజ్‌ చుట్టూ తిరుగుతుంది. ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌ బావుంది కదా.. కథ ముందుకు వెళ్లే కొద్ది కొత్తదనం ఆశించవచ్చేమో అనుకుంటే అదీలేదు. రొటీన్‌గానే ఉంది. పైగా  ఇదే క్లైమాక్స్‌.. ఇక ఎండ్‌ అయిపోయిందనుకున్న ప్రతిసారీ కొత్త బ్లాక్‌తో మళ్లీ నిడివిని పంచేశారు. ఫైనల్‌గా డివోషనల్‌ ఎలిమెంట్‌ ఇచ్చి కథను ముగించారు. అది అంత కన్వెన్‌సింగ్‌గా లేదు. అయితే ఈ కథ ద్వారా దర్శకుడు చాలా విషయాలను టచ్‌ చేశాడు. మిడిల్‌క్లాస్‌ కుర్రాడు దారి తప్పితే అతని జీవితం ఎలా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లింది? ిపిల్లలు చేేస తప్పులకు తల్లిదండ్రులు ఎంత వేదనకు గురవుతారు. ప్రేమకు, ఆకర్షణకు మధ్య తేడా ఏంటి? అన్నది ఈ కథ ద్వారా చెప్పాడు. త్రినాథరావు కథకు దర్శకుడు ఖగేష్‌ కొంతవరకూ న్యాయం చేశాడనిపించింది. కథ రెగ్యులర్‌ ఫార్మాట్‌లోనే ఉన్నా.. ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌.. ఫ్యామిలీ ఎమోషన్స్‌, కొన్ని గ్రిప్పింగ్‌ సీన్స్‌ సినిమాకు కాస్త ప్లస్‌ అయ్యాయి.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు...
సూర్యగా విక్రమ్‌ సహిదేవ్‌ చక్కని నటన కనబర్చాడు. భావోద్వేగాలతో పాటు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కూడా బాగా చేశాడు. అయితే వయసు, అతని బాడీ లాంగ్వేజ్‌కు లవ్‌స్టోరీలు సెలెక్ట్‌ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందనిపించింది. ఇంత యాక్షన్‌ సినిమా అప్పుడే అవసరం లేదేమో అనిపించింది. అయితే పాత్ర పండించడానికి శాయశక్తులా కృషి చేశాడు. హీరోయిన్‌గా సంధ్యా వశిష్ట పాత్ర బావుంది, తన అమాయకమైన మాటలు, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. గ్రామీణ ప్రాంత అమ్మాయిగా ఒదిగిపోయింది. బుల్లెట్‌గా తారక్‌ పొన్నప్ప అలవాటైన పాత్రే చేశాడు. ఆయనకు ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. పాత్రకు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్‌ ఉంది. డ్రగ్స్‌ నాయుడు పాత్రలో చిత్ర నిర్మాత కాండ్రేగుల నాయుడు  ఫర్వాలేదనిపించారు. ఈ సినిమాకు కథ అందించిన త్రినాథరావు హీరోకి  తండ్రిగా కీలక పాత్ర పోషించారు. నటుడిగా ఆయనకు మంచి మార్కులే పడతాయి. అయితే అక్కడక్కడా కాస్త ఓవర్‌ అనిపించింది. హీరోకి తల్లి పాత్రలో మధ్యతరగతి గృహిణిగా ఇంద్రజ సహజంగా నటించారు. ఇతర పాత్రధారులు పరిధి మేరకు నటించారు. హీరోకి ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ చేసిన నటుడు చక్కని వినోదాన్ని పంచాడు. కటివరపు వంశీకృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. తన పనితీరుతో అనకాపల్లి ప్రాంతంలోనే ఉన్న ఫీలింగ్‌ తీసుకొచ్చాడు. దేవ్జాండ్‌ సంగీతం సినిమాకు ఎసెట్‌. పాటలు ఫర్వాలేదు. నేపథ్య సంగీతానికి మంచి మార్కులు పడతాయి. ఎడిటర్‌ అత్తలూరి శ్రీకృష్ణ ఫస్టాఫ్‌, క్లైమాక్స్‌లో కాస్త కత్తెరకు పని చెప్పుంటే బాగుండేది. సినిమా మేకింగ్‌ బావుంది. నిర్మాత పెట్టిన డబ్బు తెరపై కనిపించింది. కొన్ని చోట్ల డైలాగ్‌లు బాగా కుదిరాయి. కొత్త దర్శకుడే అయిన కొన్ని సన్నివేశాలను డీల్‌ చేసిన విధానం బావుంది. ఫైనల్ గా కొన్ని ప్రేమకథలు పెళ్లితో పూర్తవుతాయి..కొన్ని ప్రేమకథలు త్యాగంతో పవిత్రమవుతాయి అని ఎండ్ కార్డు వేశారు. యాక్షన్‌ సినిమాలు నచ్చేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఈ వారం విడుదలైన సినిమాల్లో కాస్త ఇదే బెటర్ అని చెప్పొచు. 

ట్యాగ్‌లైన్‌:  మధ్య తరగతి కుర్రాడి ప్రేమ కథ 
రేటింగ్‌: 2.5/5

Updated Date - Oct 03 , 2026 | 08:04 AM