టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. ముగ్గురు నిందితుల అరెస్ట్!
ABN, Publish Date - Oct 19 , 2026 | 12:58 PM
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై (Tiger Shroff) )జరిగిన కాల్పుల ఘటన దర్యాప్తులో పోలీసులు ముందడుగు వేశారు.
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై (Tiger Shroff) )జరిగిన కాల్పుల ఘటన దర్యాప్తులో పోలీసులు ముందడుగు వేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు వారిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నిందితుల్లో ఇద్దరు హరియాణాకు చెందినవారు కాగా, మరొకరు బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
ముందస్తు రెక్కీతో దాడికి ప్లాన్..
దర్యాప్తులో భాగంగా కాల్పులకు ముందు నిందితులు టైగర్ ష్రాఫ్ కదలికలపై నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రతి ఆదివారం ఆయన జుహులోని ఫుట్‌బాల్ మైదానానికి వస్తుంటారని తెలుసుకున్న దుండగులు, ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో దాడి చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ప్రొఫెషనల్ షూటర్లు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపినట్లు నేషనల్ మీడియా చెబుతోంది. అయితే ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల పాత్రపై అధికారిక దర్యాప్తులో మరింత స్పష్టత రావాల్సి ఉంది.కాల్పుల తర్వాత రైలులో పరారీ!కాల్పుల అనంతరం నిందితులు తమ ద్విచక్ర వాహనాన్ని అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలేసి రైలు ఎక్కినట్లు సమాచారం. అనంతరం రైలు మార్గంలో ప్రయాణిస్తూ మహారాష్ట్రను దాటి ఇతర ప్రాంతాలకు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చివరకు రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్లో వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఘటనకు ముందు అభిమానులతో కాసేపు..
ఈ ఘటనకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కాల్పులు జరగడానికి సుమారు గంట ముందు టైగర్ ష్రాఫ్ ఫుట్‌బాల్ మైదానం వద్ద తనను కలవడానికి వచ్చిన అభిమానులతో మాట్లాడినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కాల్పుల ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే తీవ్రంగా ఖండించారు. నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన శిందే, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు, నటుడిపై జరిగిన కాల్పులను ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది.
ఇవి కూడా చదవండి:
లాస్ ఏంజెల్స్‌లో ‘రామాయణ’ హిస్టారికల్ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?
మనం ఎప్పుడూ భయపడకూడదు.. ఇచ్చిపడేయాలి: విశ్వక్సేన్
యంగ్ హీరోతో ‘ఓ పిట్టకథ’ దర్శకుడి చిత్రం ప్రారంభం