మిల్కీబ్యూటీ మరో బోల్డ్ స్టెప్.. గ్లామరస్ హారర్ రోల్ చిత్రం ప్రారంభం
ABN, Publish Date - Jul 17 , 2026 | 07:36 PM
గత కొన్ని ఏళ్లుగా తమన్నా తన కెరీర్ గ్రాఫ్‌ను పూర్తిగా మార్చేసింది. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా, హిందీ వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే.
సినీ ప్రియులను భయపెడుతూనే ఎంతగానో అలరించిన బాలీవుడ్ పాపులర్ హారర్ ఫ్రాంచైజీ ‘రాగిణి’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీస్‌లో వస్తున్న తాజా చిత్రం ‘రాగిణి 3’ (Ragini 3) లో స్టార్ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ లండన్‌లో అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు శశాంక ఘోష్ తెరకెక్కిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ హారర్ థ్రిల్లర్‌ను థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2027లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ మళ్లీ వెండితెరపైకి వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
హారర్ అంశాలకు గ్లామర్‌ను జోడించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడంలో ‘రాగిణి’ సిరీస్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు వస్తున్న మూడో భాగంలో తమన్నా (Tamannaah Bhatia) క్యారెక్టర్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. తన కెరీర్‌లోనే అత్యంత బోల్డ్, గ్లామరస్ అండ్ పవర్‌ఫుల్ పాత్రలో తమన్నా ఈ చిత్రంలో కనిపించబోతోంది. లండన్ పరిసరాల్లో జరిగే ఫస్ట్ షెడ్యూల్‌లో ఆమెకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ కిడ్ జునైద్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా వెల్లడిస్తామని చిత్ర బృందం స్పష్టం చేసింది.
గత కొన్ని ఏళ్లుగా తమన్నా తన కెరీర్ గ్రాఫ్‌ను పూర్తిగా మార్చేసింది. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా, హిందీ వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆమె చేసిన బోల్డ్ పర్ఫార్మెన్స్‌లు నార్త్ ఆడియన్స్‌కు ఆమెను మరింత చేరువ చేశాయి. ఒకవైపు టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు బాలీవుడ్ ప్రాజెక్టులతో పాన్-ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. దీనికి తోడు స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తమన్నా, రజనీకాంత్ ‘జైలర్’ చిత్రంలోని ‘కావాలయ్యా’ పాటతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన అద్భుతమైన డాన్స్ స్టెప్పులు, గ్లామర్‌తో సినిమాల ప్రమోషన్స్‌కు భారీ హైప్ తెస్తున్న తమన్నా, ఇప్పుడు ‘రాగిణి 3’తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
ఐశ్వర్య రాజేష్ సుకుమారి షాక్ ఎలా ఉందంటే..
The Odyssey Review: క్రిస్టోఫర్ నోలన్.. ది ఒడిస్సీ మూవీ రివ్యూ
సీఎం విజయ్ పాలనపై వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ పోస్ట్..