షారుఖ్ ఖాన్ ‘కింగ్’ కొత్త పోస్టర్.. గులాబీ పువ్వుతో పవర్‌ఫుల్ లుక్!

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:38 PM

షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. గులాబీ పువ్వు, పవర్‌ఫుల్ లుక్‌తో ఆకట్టుకుంటున్న షారుఖ్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

King movie

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'కింగ్‌'. డిసెంబర్ 24న వరల్డ్ వైడ్‌ రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా నుంచి షారుఖ్‌ ఖాన్ నయా పోస్టర్ విడుదలైంది. యాక్షన్, ఇంటెన్సిటీతో పాటు రొమాన్స్‌ టచ్ ఉన్న లుక్‌తో షారూక్ ఖాన్ అద‌ర‌గొట్టారు. పెదాల మధ్య గులాబీ పువ్వు.. నిప్పులు చెరిగే కంటి చూపు.. ఇలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ ‘కింగ్’ కొత్త పోస్టర్‌తో అందరి దృష్టిని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఆకర్షిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు రొమాన్స్‌ టచ్‌తో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో షారుఖ్ ఎలా కనిపించబోతున్నారో ఈ పోస్టర్ ఓ చిన్న గ్లింప్స్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై కొత్త పోస్టర్ మరింత అంచనాలను పెంచుతోంది. ‘కింగ్’ కొత్త పోస్టర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. భారీ యాక్షన్, పవర్‌ఫుల్ లుక్‌తో ఆకట్టుకుంటోన్న ఈ పోస్టర్.. వెండితెరపై షారుఖ్ ఖాన్‌ను సరికొత్త అవతార్‌లో చూడాలనే ఆసక్తిని అభిమానుల్లో మరింత పెంచుతోంది.

ఇవి కూడా చదవండి:

Alias Rukmini: రుక్కు రుక్కు రుక్మిణి.. కిట్టయ్యకి నువ్వే అలివేణి

Scene: సిగరెట్లు తాగితే మగతనం తగ్గిపోతుందిరోయ్..

బాత్రూమ్‌లో జారి ప‌డి.. పైకి లేవ లేని స్థితిలో ఒంట‌రిగా షావుకారు జానకి కుమార్తె!

Updated Date - Oct 27 , 2026 | 05:42 PM

ఘట్టమనేని వారసుడితో బేబీ బ్యాచ్..

పవన్ భార్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్.. రేణుకి జరిగిందే జరిగిందా

దూకుడు పెంచిన ధ‌నుష్‌.. మహిళా విభాగంతో భేటీ

మేనమామ నాగార్జునతో మేనల్లుడు సుమంత్ సినిమా!

హీరో అజిత్‌కు గుడి.. విగ్రహానికి క్షీరాభిషేకం