ఘట్టమనేని వారసుడితో బేబీ బ్యాచ్..
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:55 PM
ఘట్టమనేని కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమైన యంగ్ హీరో జయకృష్ణ (Jaya Krishna Ghattamaneni) 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.
ఘట్టమనేని కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమైన యంగ్ హీరో జయకృష్ణ (Jaya Krishna Ghattamaneni) 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కథ పరంగా ప్రేక్షకులకు నచ్చలేదు కానీ, జయకృష్ణ యాక్టింగ్ విషయంలో మంచి ప్రశంసలనే అందుకున్నాడు. ఇక మొదటి సినిమా తీవ్ర నిరాశ పరచడంతో జయకృష్ణ తన తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం జయకృష్ణ రెండో సినిమా దాదాపు ఖరారైనట్లు సమాచారం. బేబీ, చెన్నై లవ్ స్టోరీ వంటి సంచలన చిత్రాలను అందించిన ఫేమ్ సాయి రాజేష్ , ఎస్కేఎన్ ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మించానున్నారని టాక్. ఈ చిత్రానికి సాయి రాజేష్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, దర్శకత్వ బాధ్యతలను మాత్రం మరొకరికి అప్పగించనున్నారట. గతంలో చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి కూడా సాయి రాజేష్ కథ అందించగా రవి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇప్పుడు జయకృష్ణ సినిమా విషయంలో కూడా ఇదే ప్యాటర్న్‌ను అనుసరించనున్నారట. ఈ సినిమా దర్శకుడు ఎవరు, ఏ జానర్లో తెరకెక్కబోతోందనే వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
ఇక జయకృష్ణ మొదటి సినిమాకి కృష్ణ, మహేష్ బాబు అభిమానుల మద్దతు కూడా ఈ సినిమాకు పెద్దగా లభించలేదనే చెప్పాలి. ముఖ్యంగా బాబాయ్ మహేష్ ఈ సినిమాకి ఎంతో కొంత హైప్ ఇస్తాడని అనుకున్నారు. కానీ, ఆయన నుంచి ఒక వీడియో బైట్ తప్ప ఏమి రాలేదు. కథ మంచిగా ఉంటే మహేష్ ప్రమోషన్ కూడా అవసరం లేదని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. మరి ఈసారి మహేష్ ఏమైనా.. అన్న కొడుకుకు సపోర్ట్ గట్టిగా చేస్తాడా.. ? విజయవంతమైన సాయి రాజేష్ - ఎస్కేఎన్ ఫార్ములా మరోసారి వర్కవుట్ అవుతుందా అనేది చూడాలి.