హీరో అజిత్‌కు గుడి.. విగ్రహానికి క్షీరాభిషేకం

ABN , Publish Date - Oct 27 , 2026 | 08:24 AM

ఏ ముహుర్తానా విజ‌య్ పార్టీ పెట్టి అధికారంలోకి వ‌చ్చాడో గానీ ఇప్పుడు త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో సినిమా న‌టులు వారి అభిమానుల హంగామా ప‌తాక స్థాయికి చేరింది.

Ajith Kumar

ఏముహుర్తానా విజ‌య్ పార్టీ పెట్టి అధికారంలోకి వ‌చ్చాడో గానీ ఇప్పుడు త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో సినిమా న‌టులు వారి అభిమానుల హంగామా ప‌తాక స్థాయికి చేరింది. ఇప్ప‌టికే ధ‌నుష్ పార్టీ ప్ర‌క‌ట‌న వ్యవ‌హ‌రాల్లో బిజీగీ ఉండ‌గా శివ కార్తీకేయ‌న్ ఇన‌ప్పుడిప్పుడే ఈ వ‌రుస‌లోకి దిగుతున్నాడు. ఇదే స‌మ‌యంలో ఇప్పుడు అజిత్‌కు ఇష్టం లేక‌పోయినా ఆయ‌న ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్‌లో షాక్‌ల మీద షాకులు ఇస్తున్నారు.

ఇప్ప‌టికే త‌మిళ‌నాట త‌మ అభిమాన తార‌లు నటి ఖుష్బూ కోసం గుడి నిర్మించడం, నయన తారకు 60 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయడం అంటూ కలకలం సృష్టించే వీరాభిమానులు తాజాగా హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) విగ్రహాన్ని ప్రతిష్టించి, దానికి క్షీరాభిషేకం కూడా చేసిన విచిత్ర సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చెన్నై మాంగాడు సమీపంలోని కోవూరులో 'అనైత్తు నన్బర్ళ్ మున్నేట్ర కళగం (ఆల్‌ఫ్రెండ్స్ ప్రొగ్రెసివ్ పార్టీ) అనే సంస్థ అధ్యక్షుడు బాబు నేతృత్వంలో విగ్ర హావిష్కరణ జరిగింది. ఆ విగ్రహానికి దిష్ఠితీసి 108 కొబ్బరికాయలు కూడా కొట్టారు. జై అజిత్ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ టీవీకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి విజయ్‌తో పోటీ పడగల సమర్థవంతమైన నాయకుడు అజిత్ మాత్రమేనని, త్వరలో ఆయనకు ఆలయం కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అజిత్ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది.

Updated Date - Oct 27 , 2026 | 08:27 AM