Emraan Hashmi: భయానక పాత్రతో వస్తున్న ఒమీ..
ABN, Publish Date - Nov 03 , 2026 | 03:05 PM
‘ఓజీ’ (OG) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ మరోసారి టాలీవుడ్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ (OG) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) మరోసారి టాలీవుడ్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఓజీ’లో ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్న ఆయన.. ఈసారి పూర్తి భిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ‘రూహ్’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
హారర్ కథతో కొత్త ప్రయోగం!
మయాంక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ద్వారా ఇమ్రాన్ మరో కొత్త జానర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో నటించడంతో పాటు సంగీతం విషయంలోనూ ఇమ్రాన్ ప్రత్యేకంగా భాగం కానున్నట్లు వెల్లడించారు. ‘రూహ్’ ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుందని పేర్కొన్నారు.
తెలుగులోనూ విడుదల!
ఈ చిత్రాన్ని కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్బింగ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీంతో ‘ఓజీ’ తర్వాత ఇమ్రాన్ హష్మీని మరోసారి తెలుగు తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనుంది. ‘ఓజీ’ సినిమాలో విలన్‌గా మెప్పించిన ఇమ్రాన్.. ఈసారి హీరోగా హారర్ కథతో ఎలాంటి అనుభూతిని అందిస్తారో అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ALSO READ:
Ritika Singh: నా పేరుతో.. నాకు తెలియకుండానే సబ్ స్క్రిప్షన్ రూ.400 వసూలు చేస్తున్నారు
Mahesh Babu: గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు.. షార్ట్ గన్ గేమ్స్‌లో పెట్టుబడి!
Sundar C: నిజాలు తెలుసుకోకుండా.. వార్తలు రాయడం బాధిస్తుంది