సైయారా కాంబోతో సత్రంగా!
ABN, Publish Date - Apr 22 , 2026 | 05:29 PM
కొన్ని కాంబినేషన్లకు వైబ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారంటే వారి నుంచి మరో సినిమాకు ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. బాలీవుడ్ లో అలాంటి హిట్ కొట్టిన మూవీ కాంబో రిపీట్ అవుతుండటం బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దాని పేరు కూడా బయటకు వచ్చేసింది!
బాలీవుడ్‌లో మరో సూపర్ లవ్ స్టోరీ రెడీ అవుతోంది. ఇటీవల భారీ వసూళ్ళతో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'సైయారా' మూవీ జోడి మళ్ళీ తెరపైకి రాబోతోంది. 'సైయరా'తో ఓవర్ నైట్ స్టార్లు అయిన అహాన్ పాండే, అనీత్ పడ్డా జంట డైరెక్టర్ మోహిత్ సూరితో కలిసి కొత్త ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 'సైయరా' రీయూనియన్ సెలబ్రేషన్ వేదికగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా టైటిల్ కూడా లీక్ అయిపోయింది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో 'సైయారా' టీమ్ చేయబోతున్న రెండో సినిమాకు ‘సత్రంగా’ (sayranga) అనే టైటిల్‌ను పెట్టాలని మూవీ యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. 'సైయారా'ను మించిన ప్రేమ కథగా దీనిని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ‘సత్రంగా’ అనేది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ మాత్రమేనని అంటున్నారు అయితే ఈ పేరును ఇప్పటికే టి-సిరీస్ సంస్థ రిజిస్టర్ చేసుకుంది. అందువల్ల వారితో మాట్లాడి... ఈ రైట్స్ ను తీసుకుని అదే పేరును పెడతారా... లేకపోతే మూవీ సెట్స్ పైకి వెళ్ళాక మారుస్తారా అనేది ఇంకా నిర్ణయించలేదట.
'యానిమల్' సినిమాలోని ఆర్జిత్ సింగ్ హిట్ సాంగ్ ‘సత్రంగా’ను గుర్తు చేసే ఈ టైటిల్ భిన్న భావోద్వేగాలను ప్రతిబింబిస్తుంది. మోహిత్ సూరి ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్‌తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరిలో షూటింగ్‌ను ప్రారంభించి, వచ్చే యేడాది విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టారు. అహాన్, అనీత్ తమ ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేసుకుని ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. 'సైయారా' సక్సెస్ తర్వాత ఈ రీయూనియన్ భారీ హైప్‌ని సృష్టిస్తోంది. మరీ రెండోసారి మ్యాజిక్ చేయడానికి వస్తోన్న ఈ కాంబో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Read Also: చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?
Read Also: సందిగ్ధంలో రణబీర్‌కపూర్!