సందిగ్ధంలో రణబీర్‌కపూర్!
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:02 PM
'యానిమల్' తర్వాత రణబీర్ కపూర్ నటిస్తున్న 'రామాయణ', 'లవ్ అండ్ వార్' చిత్రాల షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పుడు రణబీర్ కపూర్ 'ధూమ్ 4, 'బ్రహ్మాస్త్ర 2' చిత్రాలలో దేనిని పట్టాలెక్కించాలో తెలియక సందిగ్ధంలో ఉన్నాడట.
'యానిమల్' (Animal) తో గ్రాండ్ విక్టరీని తన కిట్‌లో వేసుకున్న రణబీర్‌కపూర్ (Ranbir Kapoor) ప్రస్తుతం తన కెరీర్‌లోనే మైల్ స్టోన్స్ అనదగ్గ చిత్రాలను చేస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న భారతీయ ఇతిహాసం 'రామాయణ' (Ramayana) లో రణబీర్ రాముడిగా నటిస్తుండే, సీతగా సాయిపల్లవి (Sai Pallavi), రావణాసుడిగా యశ్ యాక్ట్ చేస్తున్నారు. ఈ యేడాది దీపావళికి ఈ సినిమా తొలి భాగం విడుదల అవుతుంది. అలానే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న 'లవ్ అండ్ వార్' మూవీలోనూ అలియా భట్ తో కలిసి రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 21న జనం ముందుకు రానుంది.
ఆ తర్వాత మూడు సీక్వెల్స్ లో రణబీర్ నటించాల్సి ఉంది. అందులో ఒకటి 'యానిమల్' సీక్వెల్ 'యానిమల్ పార్క్'. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి బాగానే టైమ్ పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ... ప్రభాస్ తో 'స్పిరిట్' మూవీ చేస్తున్నాడు. అది రిలీజ్ అయిన తర్వాత కానీ 'యానిమల్ పార్క్' పట్టాలెక్కదు. ఈ సినిమా కాకుండా రణబీర్ కపూర్ కమిట్ అయిన రెండు సీక్వెల్స్ ఉన్నాయి. అవి 'ధూమ్ 4', 'బ్రహ్మాస్త్ర 2'. 'ధూమ్' సీరిస్ చిత్రాలు ఘన విజయాలు సాధించిన నేపథ్యంలో 'ధూమ్ 4'కు మంచి క్రేజే ఉంది. 'ధూమ్ 4' చిత్రం స్క్రిప్ట్ ను దర్శకుడు ఇంకా సిద్థం చేయలేదట. అలానే ఇటు 'బ్రహ్మాస్త్ర 2' మూవీ కాస్టింగ్‌లో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. అవి ఫైనల్ కాలేదని తెలుస్తోంది. సో... ఈ రెండు సినిమాలలో దేనిని ముందు పట్టాలెక్కించాలన్న విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోందట. ఏది ఏమైనా... ఏ దర్శకుడు ముందు బౌండ్ స్క్రిప్ట్ ను తనకు ఇస్తే... ఆ ప్రాజెక్ట్‌కు పచ్చ జెండా ఊపాలన్నది రణబీర్ కపూర్ మనోగతమని సన్నిహితులు చెబుతున్నారు.