Rashmika Mandanna : దర్శకులకు నా క్షమాపణలు

ABN , Publish Date - Jan 13 , 2025 | 03:53 AM

జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయపడినట్లు కథానాయిక రష్మిక మందన్న సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు.

Heroine Rashmika : జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయపడినట్లు కథానాయిక రష్మిక మందన్న సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. కుడి కాలుకు గాయం అయిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘గాయంతో చిత్రీకరణకు హాజరుకాలేకపోతున్నాను. నా వల్ల జరుగుతున్న జాప్యానికి చింతిస్తున్నాను. ‘థామా, సికందర్‌, కుబేర’ చిత్ర దర్శకులకు నా క్షమాపణలు. పూర్తిగా కోలుకునేందుకు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. గాయం మానగానే తిరిగి సెట్స్‌లో అడుగుపెడతాను’ అని రష్మిక తెలిపారు.

Updated Date - Jan 13 , 2025 | 03:53 AM