‘రామాయణ’ దండయాత్రకు అడ్డుగా గాడ్జిల్లా.. ఊహించలేదు కదా!
ABN, Publish Date - Sep 09 , 2026 | 08:58 PM
ప్రపంచ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత భారీ ప్రాజెక్టుల్లో.. ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి. ఈ సినిమాకు గాడ్జిల్లా అడ్డుగా నిలబడనుంది.
ప్రపంచ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత భారీ ప్రాజెక్టుల్లో.. ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న చిత్రాల్లో ‘రామాయణ’ (Ramayana) ఒకటి. మరోవైపు జపాన్ సినిమా నుంచి గ్లోబల్ వైడ్‌గా సంచలనాలు సృష్టించడానికి వస్తున్న ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ (Godzilla Minus Zero) కూడా అదే స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఈ రెండు భారీ చిత్రాలు ఒకే సమయంలో బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో, ప్రపంచవ్యాప్తంగా సినీ వర్గాల్లో ఓ రేంజ్‌లో చర్చలు నడుస్తున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య పోటీ కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా, ఐమాక్స్ స్క్రీన్‌ల కేటాయింపులోనూ హోరాహోరీగా సాగనుంది.
ఈ రెండు చిత్రాలు కూడా ప్రత్యేకంగా ఐమాక్స్ ఫార్మాట్ కోసమే తెరకెక్కించడంతో, థియేటర్ల షేరింగ్ విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది. తాజాగా విడుదలైన ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ ట్రైలర్ సంచలనం సృష్టించడంతో, ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా వైపే ఎక్కువ మొగ్గు కనిపించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్, జపనీస్ విజువల్ ఎఫెక్ట్స్ మ్యాజిక్‌ను ఇష్టపడే ఆడియెన్స్‌ను ఈ జైంట్ మాన్‌స్టర్ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భారీ పోటీ ‘రామాయణ’ సినిమాపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదన కూడా తెరపైకి వస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ క్రియేట్ చేస్తున్న అంచనాల సునామీని తట్టుకుని, మన పౌరాణిక ఇతిహాస చిత్రం ఏ మేరకు నిలదొక్కుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఓవర్సీస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం పెద్ద సవాల్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే, మన ఇతిహాసాలలోని ఎమోషన్స్, భక్తి, విజువల్ వండర్స్‌కు ఉన్న గ్లోబల్ అప్పీల్ వేరు. నితిష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ దృశ్యకావ్యం కేవలం యాక్షన్ పరంగానే కాకుండా, హృదయాలను హత్తుకునే కథా బలంతో వస్తోంది. కాబట్టి, కేవలం టెక్నికల్ హంగులకే పరిమితం కాకుండా, ఎమోషనల్ కనెక్ట్ ఉంటే మాత్రం ‘రామాయణ’ ఏమాత్రం వెనకడుగు వేయదని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమా సత్తా ఏంటో నిరూపించడానికి వస్తున్న ‘రామాయణ’ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఈ జపాన్ రాక్షస బాలాన్ని ఎలా ఎదుర్కొంటుంది? ఐమాక్స్ స్క్రీన్‌ల కోసం జరుగుతున్న ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు? ఈ రెండు చిత్రాల మధ్య రసవత్తరంగా మారిన ఈ వార్ చివరికి ఎవరికి విజయాన్ని ఇస్తుంది? అనేది సినిమా విడుదలయ్యాక తేలనుంది.
ఇవి కూడా చదవండి:
అతనితో రిలేషన్ వర్కవుట్ కాలేదు.. ఆ తర్వాత ఎవరితో కమిట్ కాలేదు: కావ్యశ్రీ
‘మండాడి’కి యుబైఏ.. విడుదలకు సిద్ధం
ఓవర్సీస్‌లో ‘ది ప్యారడైజ్’ మాస్ జాతర.. సునామి రాబోతోందా