ఓవర్సీస్‌లో ‘ది ప్యారడైజ్’ మాస్ జాతర.. సునామి రాబోతోందా
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:32 PM
సాలిడ్ స్టార్ పవర్ ఉన్న నాని నుంచి ఇప్పుడు ఒక మాస్ అండ్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్ వస్తోంది. అదే ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani).. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే, బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ముఖ్యంగా నానికి బలమైన మార్కెట్‌లలో ఓవర్సీస్, అందునా యూఎస్ మార్కెట్ చాలా ప్రధానమైంది. ఇక్కడ నాని క్రేజ్ మామూలుగా ఉండదు. మన దేశంలో కలెక్షన్ల పరంగా కాస్త అటుఇటుగా నిలిచిన సినిమాలు కూడా, యూఎస్‌లో మాత్రం సులభంగా 1 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ను దాటేస్తుంటాయి. ఆ రేంజ్ స్టామినాను నాని అక్కడ సొంతం చేసుకున్నారు. ఇలాంటి సాలిడ్ స్టార్ పవర్ ఉన్న నాని నుంచి ఇప్పుడు ఒక మాస్ అండ్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్ వస్తోంది. అదే ‘ది ప్యారడైజ్’ (The Paradise).
ఇప్పటికే దసరా వంటి కల్ట్ హిట్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్, భారీ తారాగణంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా తాలూకా ప్రభావం అప్పుడే బాక్సాఫీస్ వద్ద స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. సినిమాకు సంబంధించిన యూఎస్ మార్కెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడమే ఆలస్యం, అక్కడ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ట్రేడ్ వర్గాలు కూడా ఊహించని విధంగా, చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా లక్ష డాలర్ల మార్క్‌ను అవలీలగా దాటేసి.. ఓవర్సీస్‌లో సరికొత్త సెన్సేషన్ సృష్టించింది. ఈ జోరు చూస్తుంటే, సినిమా థియేటర్లలోకి వచ్చే నాటికి ‘ది ప్యారడైజ్’ ఊహించని రేంజ్ ఓపెనింగ్స్ సాధించడం పక్కా అని ట్రేడ్ పండితులు ఖరారు చేస్తున్నారు.
ఈ సినిమాపై అంచనాలు ఇంతలా పెరగడానికి మరో ప్రధాన కారణం మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్. ఇప్పటి వరకు రిలీజైన ‘ఆయాషేర్, యేషనాగుల’ సాంగ్స్ యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల టేకింగ్, నాని రగ్గడ్ లుక్, దానికి తోడు అనిరుద్ అందించే మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే యూత్‌లో విపరీతమైన క్రైమ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. అన్ని హంగులను పూర్తి చేసుకుంటూ, ఈ సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో మొదలైన ఈ హవా చూస్తుంటే, నాని తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కొట్టడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది. మరి ఈ ‘ప్యారడైజ్’ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Mahendragiri Vaarahi: 'మురారి'కి దీనికి సంబంధం లేదు!
Karunas: ఇప్పుడు నాకు పెద్దగా మార్కెట్ లేదు! కానీ నాతో సినిమాకు రూ.7 కోట్లు ఖర్చు చేశారు
గురు స్వాములు, మాల ధారులను అవమానిస్తారా.. అయ్యప్ప భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి