‘రామాయణ’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. యశ్ విశ్వరూపం
ABN, Publish Date - Sep 28 , 2026 | 12:06 PM
భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఊహించని భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana). ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఊహించని భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లను అధికారికంగా విడుదల చేస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేశారు. రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) లార్జర్ దేన్ లైఫ్ అవతార్‌తో పాటు.. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబేల లుక్స్‌ను రివీల్ చేశారు.
రావణుడిగా యశ్ రాజసం
తాజాగా విడుదలైన రావణుడి పోస్టర్‌లో రాకింగ్ స్టార్ యశ్ లుక్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. సకల శాస్త్ర కోవిదుడు, లంకాధిపతి అయిన రావణుడి పాత్రకు తగ్గట్లుగా నవరత్నాలు పొదిగిన భారీ బంగారు కిరీటం, మెడలో ముత్యాల హారాలు, చేతులకు స్వర్ణ కంకణాలతో యశ్ రాజసంతో కనిపించారు. ఆయన కళ్లలోని రౌద్రం, గంభీరమైన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే వెండితెరపై రావణుడి పాత్రను ఎంత భీకరంగా, రాజసంగా ఆవిష్కరించబోతున్నారో స్పష్టమవుతోంది. గతంలో వచ్చిన టీజర్ ట్రైలర్ తర్వాత ఈ పోస్టర్ సినిమాపై హైప్‌ను తారాస్థాయికి చేర్చింది.
వనవాసంలో రాముడు, సీత, లక్ష్మణుడు
రావణుడితో పాటు రాముడు, సీతాదేవి, లక్ష్మణులను పరిచయం చేస్తూ విడుదల చేసిన మరో పోస్టర్ భక్తిపారవశ్యాన్ని కలిగిస్తోంది. వనవాస కాలంలో దండకారణ్యంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే కలిసి నడుస్తున్న దృశ్యాన్ని అత్యంత సహజంగా, అద్భుతమైన విజువల్ గ్రాండియర్‌తో తీర్చిదిద్దారు. సాయి పల్లవి సీతగా తన పవిత్రమైన ఆహార్యంతో మెస్మరైజ్ చేస్తుండగా.. రణ్‌బీర్ ప్రశాంతమైన, తేజోవంతమైన రాముడి రూపంలో ఆకట్టుకున్నారు. ఈ రెండు పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మహాగాథను ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అధినేత నమిత్ మల్హోత్రా సమర్పణలో.. 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ వీఎఫ్ఎక్స్ దిగ్గజ సంస్థ ‘DNEG’, యశ్‌కు చెందిన ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో హనుమంతుడిగా బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటిస్తున్నారు. మేకర్స్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ‘రామాయణ పార్ట్ 1’ చిత్రం 2026 దీపావళి కానుకగా విడుదల కానుండగా, ‘రామాయణ పార్ట్ 2’ చిత్రం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి:
ప్రియుడిని పెళ్లాడిన ఆర్జీవీ హీరోయిన్.. ఫొటోలు వైరల్
దాదా.. బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్
150 కోట్ల క్లబ్‌లోకి ‘ద ప్యారడైజ్’.. అసలు పరీక్ష స్టార్ట్