సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'రామాయణ' వర్సెస్ 'గాడ్జిల్లా'!

ABN, Publish Date - Apr 15 , 2026 | 05:00 PM

బీటౌన్ బిగ్ మూవీకి పెద్ద ప్రాబ్లమే వచ్చింది. ఇండియాలోనే కొత్త రికార్డు సృష్టించాలని చూస్తున్న ఈ సినిమాకు ఊహించని క్లాష్ ఏర్పడింది. అది కూడా తాము బాక్సాఫీస్ బరిలోకి దిగే సమయంలోనే! దీంతో మేకర్స్ మూవ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు రేపుతున్న 'రామాయణ' సినిమాకు పెద్ద షాక్ తగిలింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి... శ్రీరాముడు, సీతాదేవిగా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ భారీ ఎపిక్ మూవీ ఇండియా నుంచి మొట్టమొదటి ఐమ్యాక్స్ వెర్షన్‌గా వస్తోంది. దీపావళి సందర్భంగా ఇంటర్నేషనల్ లెవెల్‌లో దీనిని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్న సమయంలో... ఒక జపాన్ సినిమా వారి ఆశలపై నీళ్ళు జల్లుతోంది.


'రామాయణ' మూవీతో క్లాష్ కాబోయే ఆ సినిమా ఏమిటంటే 'గాడ్జిల్లా మైనస్ జీరో'!. ఈ ఫ్రాంచైజీలో 2023లో వచ్చిన 'గాడ్జిల్లా మైనస్ వన్' సినిమా ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్‌కి గానూ ఆస్కార్ అవార్డును సైతం గెల్చుకుంది. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ గా 'గాడ్జిల్లా మైనస్ జీరో' రాబోతోంది. జపాన్ నుంచి వస్తున్న మొదటి ఐమ్యాక్స్ వెర్షన్‌ ఇది. 'రామాయణ' రిలీజ్ సమయంలోనే నవంబర్ 6 'గాడ్జిల్లా మైనస్ జీరో' కూడా విడుదల కానుంది. 'గాడ్జిల్లా' సిరీస్‌కి ఇప్పటికే గ్లోబల్ రేంజ్ లో భారీ క్రేజ్ ఉంది. దీంతో ఐమ్యాక్స్ స్క్రీన్స్ విషయంలో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గాడ్జిల్లా సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది 'రామాయణ' మేకర్స్‌కి బిగ్ షాక్ అనే చెప్పాలి. మరి ఈ సమస్యని 'రామాయణ' టీమ్ ఎలా ఎదుర్కొంటుంది? డేట్ మార్చుకుంటుందా.. లేదా ఇంకా భారీ ప్రచారంతో ముందుకెళ్తుందా? అన్నది వేచి చూడాలి.

Read Also: ఎన్టీఆర్.. మాస్ రాంపేజ్! దేవర2.. మీ ఊహకు అందదు

Read Also: స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల అరెస్ట్.. మెగా ఫ్యాన్స్ స్పందనిదే!

Updated Date - Apr 15 , 2026 | 05:05 PM