ఎన్టీఆర్.. మాస్ రాంపేజ్! దేవర2.. మీ ఊహకు అందదు

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:21 PM

త్రిబుల్‌ ఆర్‌ చిత్రంతో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో సంచలనం సృష్టించారో తెలుసు..

devara

త్రిబుల్‌ ఆర్‌ చిత్రంతో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ (Jr NTR) బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో సంచలనం సృష్టించారో తెలుసు.. త్రిబుల్ ఆర్ తరువాత యంగ్ టైగర్ నుంచి వచ్చిన దేవర (Devara) సినిమా రికార్డుల దుమ్ము దులిపేసింది. కేవలం తన మ్యానరిజమ్స్, యాక్టింగ్ పవర్‌తో ఈ చిత్రాన్ని సోలోగా 500 కోట్ల క్లబ్‌లో చేర్చారు తారక్. అయితే, థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ సినిమా, ఓటీటీలోకి వచ్చాక కొన్ని విమర్శలను ఎదుర్కొంది.

దేవర పార్ట్-1 విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ (Koratala Siva) సృష్టించిన అందులో తారక్ నటన అభిమానులను ఉర్రూతలూగించాయి. అదేవిధంగా కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. కానీ, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలయ్యాక, కథనం విషయంలో నెటిజన్లు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో వచ్చిన విమర్శలు దర్శకుడి వరకు వెళ్లాయి.

సాధారణంగా ఇలాంటి విమర్శలు వస్తే డీలా పడిపోతారు, కానీ కొరటాల శివ మాత్రం వీటిని ఒక సవాలుగా తీసుకున్నారు. పార్ట్-2 విషయంలో ఈసారి ఎక్కడా రాజీ పడకూడదని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. తాజాగా కొరటాల శివ తన సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పార్ట్-1లో కేవలం ఫియర్‌ని పరిచయం చేసిన ఆయన, పార్ట్-2లో అంతకు మించి చూపిస్తానని హింట్ ఇచ్చారు. ఈసారి కథలో ఫియర్.. పవర్.. రివెంజ్.. ఈ మూడు అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయి.

ఇక తాజాగా విడుదలైన అప్డేట్ ప్రకారం, రెండో భాగం మొత్తం వర పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తుంది. అందుకే టైటిల్‌లో కూడా 'వర' అనే అక్షరాలను హైలైట్ చేస్తూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కొరటాల శివ తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ధృవీకరించారు. దీంతో దేవర-2 షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందంటూ వస్తున్న నెగిటివ్ వార్తలకు చెక్ పడినట్లయింది. ఎన్టీఆర్ కూడా పలు సందర్భాల్లో దేవర-2 కచ్చితంగా ఉంటుంది, అది మీ ఊహకు అందదు అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నారు. మాస్ సినిమాల స్పెషలిస్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తోంది. దీనికి సంబంధించి రీసెంట్‌గా విడుదలైన తారక్ లుక్ చూస్తుంటే, ఆయన బీస్ట్ మోడ్‌ లోకి మారిపోయారని స్పష్టమవుతోంది. ఈ సినిమా పూర్తి కాగానే, పూర్తి స్థాయిలో దేవర-2 షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారు. మొత్తానికి, పార్ట్-1పై వచ్చిన విమర్శలన్నీ పార్ట్-2 విజయంతో తుడిచిపెట్టేయాలని కొరటాల శివ కంకణం కట్టుకున్నారు. భయం పరిచయమైంది.. ఇక పవర్ చూపించడం.. పగ తీర్చుకోవడం మాత్రమే మిగిలి ఉంది. మరి దేవరగా ఎన్టీఆర్ సృష్టించబోయే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

Updated Date - Apr 15 , 2026 | 04:22 PM