సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రియాంక పెళ్ళిపై రాఖీ కామెంట్స్

ABN, Publish Date - Apr 24 , 2026 | 05:08 PM

కాంట్రవర్సీ లేకుండా రాఖీ సావంత్ వార్తల్లో కనిపించదు. ఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేయడం, హెడ్ లైన్స్ లోకి రావడం ఆమెకు బాగా అలవాటు. అలాంటి బ్యూటీ ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్‌ స్టార్‌ హీరోయిన్‌పై కామెంట్స్ చేయడం బీటౌన్‌లో సెగలు రేపుతోంది.

Priyanka Chopra and Rakhi Sawant

రాఖీ సావంత్.. బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌. ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకుంది. అవి కాస్తా పెటాకులయ్యాయి. ప్రెజెంట్ సింగిల్‌గా ఉన్న ఈ హాట్ బ్యూటీ... తాజాగా ఒక ఇంటర్వ్యూలో తను మూడో వివాహం చేసుకోబోతున్నట్టు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ విషయం గురించి మాట్లాడే క్రమంలో స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కాంట్రవర్షియల్‌ యాక్ట్రస్‌ చేసిన వాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.


గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కంటే చాలా చిన్న వయసున్న నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకోవడాన్ని ఉద్దేశించి రాఖీ సావంత్ ఘాటు విమర్శలు చేసింది. తన వెంట కూడా 16, 17 ఏళ్ల కుర్రాళ్లు తిరుగుతుంటారని, కానీ తనకు అలాంటి వారు నచ్చరని రాఖీ సావంత్‌ కామెంట్‌ చేసింది. ఒక కుర్రాడిని బుట్టలో వేసుకుని పెళ్ళి చేసుకోవడానికి తాను ప్రియాంక చోప్రా కాదని.. తన వయసు వారినే తాను ఇష్టపడతానంటూ చెప్పింది.

ఓ వైపు ఇలా ప్రియాంక చోప్రాపై సైటర్లు వేస్తూనే ఇంకోవైపు దేశీగాళ్ అందాన్ని రాఖీ సావంత్‌ పొగిడిసేంది. ప్రియాంక ఇప్పటికీ యంగ్‌గా కనిపిస్తుందని, చెప్పాలంటే నిక్ కంటే చిన్నదిగా కనబడుతుందని రాఖీ వ్యాఖ్యానించింది. ఇలా ఓ వైపు కితాబిస్తూనే, మరోవైపు పెళ్ళిపై రాఖీ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. రాఖీ తీరుపై ప్రియాంక చోప్రా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ప్రియాంక తన భర్త నిక్‌తో హ్యాపీగా ఉందని... అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని హితవు పలుకుతున్నారు. ప్రెజెంట్ హాలీవుడ్ మూవీస్‌తో పాటు వెబ్ సిరీస్‌లలో ప్రియాంక నటిస్తోంది. అంతేకాక రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తున్న 'వారణాసి'లో పవర్ ఫుల్ రోల్ చేస్తోంది ప్రియాంక చోప్రా. ఇలా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రియాంకపై రాఖీ సావంత్‌ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని అభిమానులు చెబుతున్నారు. అయితే రాఖీ మాత్రం డోంట్ కేర్ అన్నట్టుగా వ్యహరిస్తోంది. మరి ప్రియాంక దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read Also: ప్ర‌భాస్‌.. మేనియా! 'డార్లింగ్' రీ రిలీజ్‌ రికార్డుల మోత‌

Read Also: Annu Kapoor : తమన్నాపై ఎలాంటి దురుద్దేశం లేదు..

Updated Date - Apr 24 , 2026 | 05:24 PM