ప్రభాస్.. మేనియా! 'డార్లింగ్' రీ రిలీజ్ రికార్డుల మోత
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:01 AM
కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. ఈ డైలాగ్ ప్రభాస్ కు ఫర్‌ఫెక్ట్‌గా సూటయ్యే డైలాగ్.
కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్.. ఈ డైలాగ్ ప్రభాస్ (Prabhas)కు ఫర్‌ఫెక్ట్‌గా సూటయ్యే డైలాగ్. రెగ్యులర్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ కొడుతున్న ఈ రోజుల్లో రీ రిలీజ్‌ల విషయంలోనూ సంచలనాలు సృష్టిస్తున్నారు మన రెబల్‌స్టార్ ప్రభాస్. ఇక తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ లవ్లీ మైల్‌స్టోన్ మూవీ అంటే డార్లింగ్ (Darling) అనే అంటారు ఆయన అభిమానులు.
స్ట్రయిట్ రిలీజ్‌లో ఈ సినిమాకు ఎంత హైప్ క్రియేట్ అయిందో, అంతకు మించి ఇప్పుడు రీ-రిలీజ్ అయ్యి తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. 2010లో లవర్ బాయ్‌గా ప్రభాస్ ఎంతగా అలరించారో, ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతోంది. థియేటర్ల వద్ద సెలబ్రేషన్స్ చూస్తుంటే ఇది పాత సినిమా అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఒక పెద్ద హీరో కొత్త సినిమా రిలీజ్ రోజున ఉండే సందడి ఇక్కడ కనిపిస్తోంది.
డార్లింగ్ సినిమా అంటేనే ప్రభాస్ అభిమానులకు ఒక బ్యూటిఫుల్ మెమరీ. కరుణాకరన్ మార్క్ క్లాసిక్ మేకింగ్, ప్రభాస్ స్టైలిష్ లుక్స్, కాజల్ అగర్వాల్ గ్లామర్.. వీటన్నిటి కలబోతే ఈ చిత్రం. ఒకప్పుడు వరుస ప్లాపుల్లో ఉన్న ప్రభాస్‌కు ఈ సినిమానే అసలైన ఊపిరి పోసింది. పక్కా కమర్షియల్ హంగులతో పాటు క్యూట్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఇప్పటికీ కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా యువత ఈ సినిమాను మరోసారి వెండితెరపై చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
డార్లింగ్ రీ-రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, పాలాభిషేకాలు చూస్తుంటే రెబల్ స్టార్ క్రేజ్ ఆకాశాన్నంటుతోందని చెప్పవచ్చు. ఇక వసూళ్ల విషయానికి వస్తే.. ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇండియా వైడ్‌గా రీ-రిలీజ్ చిత్రాలలో బాహుబలి ది ఎపిక్ 52 కోట్లతో అగ్రస్థానంలో ఉన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు డార్లింగ్ కూడా అదే స్థాయిలో వేట మొదలుపెట్టింది. మొదటి రోజు ప్రీమియర్స్ తో కలిపి ఈ సినిమా రికార్డ్స్ దిశగా దూసుకుపోతోంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. మొదటి రోజు వసూళ్లు అక్షరాలా 7.59 కోట్ల గ్రాస్‌ను టచ్ చేశాయి. రీ-రిలీజ్ అయిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హవా గట్టిగా నడుస్తోంది. ఉత్తరాంధ్ర, సీడెడ్ మేజర్ సెంటర్లలో సాలిడ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. నైజాంలో చాలా థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.
ఈ ఏడాది ప్రభాస్ నుంచి వచ్చిన రాజాసాబ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా, డార్లింగ్ మాత్రం ఆ లోటును పూర్తిగా భర్తీ చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. ప్రభాస్ క్రేజ్ రోజురోజుకూ పెరగడమే తప్ప తగ్గడం లేదని ఈ వసూళ్లే సాక్ష్యం. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత కూడా తన పాత క్లాసిక్ సినిమాలకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు. ప్రభాస్ నుంచి భారీ యాక్షన్ చిత్రాల కోసం యావత్ దేశం ఎదురుచూస్తున్న తరుణంలో, ఇలాంటి ఒక క్యూట్ లవ్ స్టోరీ రీ-రిలీజ్ అయ్యి ఇంతటి విజయం సాధించడం నిజంగా గ్రేట్.