Annu Kapoor : తమన్నాపై ఎలాంటి దురుద్దేశం లేదు..

ABN , Publish Date - Apr 24 , 2026 | 02:59 PM

'తమన్నా డ్యాన్స్‌ బాగా చేస్తుంది. చాలా తెల్లగా ఉంటుంది. మిల్కీ బాడీ  ఆమెది' అంటూ హిందీలో బాలీవుడ్‌ నటుడు అన్నూ కపూర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే!

Tamanna bhatia

'తమన్నా బాగా డ్యాన్స్‌ చేస్తుంది. చాలా తెల్లగా ఉంటుంది. మిల్కీ బాడీ  ఆమెది' అంటూ హిందీలో బాలీవుడ్‌ నటుడు అన్నూ కపూర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! ‘స్త్రీ 2’ సినిమాలోని ‘ఆజ్‌ కీ రాత్‌’ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో అన్నూకపూర్‌ తమన్నా డ్యాన్స్‌ గురించి ప్రస్తావించారు. ఆమె శరీర రంగు గురించి మాట్లాడడంతో ట్రోల్‌ అయ్యారు. దీనిపై అన్నూ కపూర్‌ తాజాగా వివరణ ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ ‘నా కామెంట్స్‌ను జనాలు  తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదే మాటలను హిందీలో కాకుండా ఇంగ్లిష్‌లో అని ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదేమో. హిందీలో చెప్పేసరికి నా వయసును ప్రస్తావిస్తూ ట్రోల్‌ చేశారు. భాష మారినంత మాత్రాన మీనింగ్‌ మారిపోదు. ఒక వ్యక్తి రూపాన్ని మెచ్చుకోవడం వేరు.. వేరే ఉద్దేశంతో చూడడం వేరు. నాకు తమన్నాపై ఎలాంటి దురుద్దేశం లేదు. నేను చేసిన కామెంట్స్‌కు తమన్నా బాధపడి ఉంటే ఆమె కాళ్లు పట్టుకోవడానికీ నేను రెడీగా ఉన్నా.  నా మనసులో తప్పుడు ఆలోచనలు లేవు కాబట్టి ఆమె కాళ్లు పట్టుకోవడం కూడా పెద్ద విషయం కాదు నాకు' అని అన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 05:20 PM