సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రకుల్, కాజల్ ముందు సాయి పల్లవి వేస్ట్..

ABN, Publish Date - Jul 20 , 2026 | 09:05 PM

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణ(Ramayana). రాముడిగా రణబీర్ కపూర్ (Ranabir Kapoor), సీతాగా సాయిపల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్(Yash) నటిస్తున్నారు.

Ramayana

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణ(Ramayana). రాముడిగా రణబీర్ కపూర్ (Ranabir Kapoor), సీతాగా సాయిపల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్(Yash) నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలోని కాస్టింగ్‌పై నెట్టింట తీవ్రస్థాయిలో చర్చలు, వివాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా సీతాదేవి పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేయడంపై ఒక వర్గం ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాస్టింగ్ డైరెక్టర్‌ను వెంటనే తీసేయాలంటూ సోషల్ మీడియాలో మీమ్స్, పోస్ట్‌లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సీతలాంటి దివ్యమైన పాత్రకు పర్ఫెక్ట్ లుక్ ఉన్న నటిని ఎంచుకోవడంలో మేకర్స్ ఘోరంగా విఫలమయ్యారనే కామెంట్స్ కనిపిస్తున్నాయి.


ఇక ఈ సినిమాలో శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వారి పోస్టర్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో నెటిజన్స్ మరింత మండిపడుతున్నారు. వెండితెరపై ప్రధాన పాత్ర అయిన సీతాదేవి కంటే శూర్పణఖ, మండోదరి పాత్రల్లో నటిస్తున్న నటీమణులే అత్యంత గ్లామరస్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. సీత అంటే దివ్యమైన రూపం ఉంటుంది. అది సాయిపల్లవి ఫేస్ లో లేదని విమర్శిస్తున్నారు. కాజల్, రకుల్ ముందు సాయిపల్లవి అందంలో తేలిపోతుందని, హీరోయిన్ కంటే కీలక పాత్రలు చేస్తున్నవారే అందంగా ఉన్నారని, ఇలా ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో సీత పాత్ర ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉందంటూ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.


అయితే సాయి పల్లవి అభిమానులు, చిత్ర బృందం మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. సీతాదేవి పాత్రకు కేవలం బాహ్య సౌందర్యమే కాకుండా పవిత్రత, ప్రశాంతత, అద్భుతమైన భావోద్వేగాలను పండించగల నటన అవసరమని.. అందుకు సాయి పల్లవి నూటికి నూరు శాతం న్యాయం చేస్తుందని మద్దతుగా నిలుస్తున్నారు. పాత్రల మధ్య ఉండే ఆ వ్యత్యాసమే సినిమాకి ప్లస్ అవుతుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ట్రైలర్ వచ్చే వరకు సాయి పల్లవి లుక్ పై ఈ రచ్చ కొనసాగేలాగే కనిపిస్తోంది. జులై 24 న రామాయణ ట్రైలర్ రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో సాయిపల్లవి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Jul 21 , 2026 | 03:33 PM