Manoj Bajpayee: ఆసక్తికరంగా మనోజ్ బాజ్పేయీ ‘గజబ్ రాత్’ ట్రైలర్
ABN, Publish Date - Oct 15 , 2026 | 02:40 PM
విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయీ మరోసారి సస్పెన్స్ థ్రిల్లర్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు.
విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయీ (Manoj Bajpayi) మరోసారి సస్పెన్స్ థ్రిల్లర్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గజబ్ రాత్’ (Gajab Raat) ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. నీరజ్ పాండే, రితేశ్ షా సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మనోజ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఉత్కంఠతో సాగిన ఈ ట్రైలర్లో మనోజ్ బాజ్పేయీ పాత్రకు తగ్గట్టుగా హావభావాలు, నటనతో ఆకట్టుకున్నారు.
ఈ సినిమాకు మొదట ‘ఘూసఖోర్ పండత్’ అనే పేరును నిర్ణయించారు. అదే పేరుతో ప్రచార చిత్రాలను కూడా విడుదల చేశారు. అయితే టైటిల్‌తో పాటు కథలోని పాత్ర చిత్రణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పేరు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ సంఘాల నుంచి వ్యతిరేకత మొదలైంది. సినిమాను విడుదల చేయకుండా నిలిపివేయాలని కోరుతూ సంబంధిత సంఘం కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా పేరును ‘గజబ్ రాత్’గా మార్చింది. టైటిల్ మార్పుతో ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది.
ALSO READ:
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు పోలీసుల నోటీసులు.. అక్టోబర్ 28 డెడ్‌లైన్!
‘జైలర్ 2’ ప్రీ-సేల్స్ విధ్వంసం: టాప్ 10 ఆల్‌టైమ్ లిస్ట్‌లో రజనీ రికార్డ్
జైలర్ 2 రివ్యూ.. సీక్వెల్ సెంటిమెంట్‌ను చెరిపేసిన రజనీకాంత్!