లెజెండరీ సింగర్ ఆశా భోంస్లేకి తీవ్ర అస్వస్థత
ABN, Publish Date - Apr 11 , 2026 | 10:16 PM
భారతీయ సంగీత శిఖరం, గాన కోకిల ఆశా భోంస్లే (92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి ఆమెకు గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు.
భారతీయ సంగీత శిఖరం, పద్మ విభూషణ్, గాన కోకిల ఆశా భోంస్లే (92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి ఆమెకు గుండెపోటు (Cardiac Arrest), ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాలు ధృవీకరించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆమె వయసు రీత్యా పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, డాక్టర్ల బృందం అత్యుత్తమ చికిత్స అందిస్తోందని తెలుస్తోంది. ఈ వార్త తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆశా భోంస్లే (Legendary singer Asha Bhosle) ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
‘‘మా అమ్మమ్మ ఆశా భోంస్లే గారు విపరీతమైన నీరసం, ఛాతి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండటం వల్ల ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నాము, త్వరలోనే ఆమె హెల్త్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తాము’’ అని.. ఆశా భోంస్లే గారి మనవరాలు జనాయ్ భోంస్లే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.