25 ఏళ్ళ ‘లగాన్’ సంబరాలు
ABN, Publish Date - Jun 04 , 2026 | 06:49 PM
ఆడియెన్స్‌కు ఆమిర్ ఖాన్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కాంపిటీషన్ గెలిస్తే కలసి సినిమా చూసే ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. తనతోనే కాదు మరికొందరు ప్రముఖులను కలిసే అవకాశం ఇవ్వబోతున్నాడు. ఇంతకి ఏ సినిమా అది? ఏం ఆఫర్ అది? తెలుసుకోవాలని ఉందా...
'లగాన్'! క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా ఎనిమిది జాతీయ అవార్డులు అందుకుని కొత్త చరిత్రను సృష్టించింది. అశుతోష్ గోవారికర్ డైరెక్షన్‌లో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా బ్రిటీష్ వారి అధిక పన్నులను వ్యతిరేకిస్తూ ఒక చిన్న గ్రామ ప్రజలు క్రికెట్ మ్యాచ్‌తో సవాలు చేసే కథతో తెరకెక్కింది. ఆస్కార్ నామినేషన్ దక్కించుకుని భారతీయ సినిమా కీర్తిని ప్రపంచానికి చాటిన 'లగాన్' జూన్ 15తో సిల్వర్ జూబ్లీ జరుపుకుంటోంది. 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా జూన్ 12 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రత్యేక షోలు వేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
రీ-రిలీజ్ కోసం కొత్తగా ఎడిట్ చేసిన ట్రైలర్ ఇప్పటికే బయటకు వచ్చింది. 1893 నాటి గ్రామీణ నేపథ్యం, బ్రిటీష్ అధికారుల అహంకారం, పోరాడే గ్రామస్తుల తెగువ, ఏఆర్ రెహమాన్ అందించిన మధురమైన సంగీతం, ఉత్కంఠభరితమైన క్రికెట్ సన్నివేశాలు... ట్రైలర్ చూస్తే మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో థియేటర్‌లో మిస్ అయిన నేటి యువతకు ఇదొక కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. కాగా రీ-రిలీజ్‌ను పురస్కరించుకుని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, లగాన్ పోస్టర్ ఛాలెంజ్ అనే సోషల్ మీడియా పోటీని ప్రారంభించింది.
పోటీలో పాల్గొనే అభిమానులు తమ క్రియేటివిటీతో 'లగాన్' పోస్టర్లను కొత్తగా డిజైన్ చేసి పంపాలి. గెలిచిన వారికి అమీర్ ఖాన్, గ్రేసీ సింగ్, రాచెల్ షెల్లీ, పాల్ బ్లాక్‌థోర్న్ సహా చిత్ర బృందంతో కలిసి స్పెషల్ స్క్రీనింగ్ చూసే అవకాశం దక్కుతుంది. మరెందుకు ఆలస్యం... ఆసక్తి ఉంటే మీరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.
ఇవి కూడా చదవండి:
త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్‌ప్రైజ్
NBK 111: ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’.. సరికొత్త అవతారంలో బాలయ్య
Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ