సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మళ్లీ తల్లి కాబోతోన్న కియారా అద్వానీ.. ఫొటోతో గుడ్‌న్యూస్

ABN, Publish Date - Oct 07 , 2026 | 02:17 PM

బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల ఇంట మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. ఈ అందాల జంట తమ అభిమానులకు మరో తీపి కబురు అందించారు.

Kiara Advani Pregnancy

బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అద్వానీ (Kiara Advani)ల ఇంట మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. ఈ అందాల జంట తమ అభిమానులకు మరో తీపి కబురు అందించారు. కియారా అద్వానీ రెండోసారి ప్రెగ్నెంట్ కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా కియారా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎంతో అందమైన ఫొటోను పంచుకుంటూ అధికారికంగా ప్రకటించారు. తన ప్రెగ్నెన్సీ వార్తను తెలియజేస్తూ కియారా షేర్ చేసిన ఫొటో నెటిజన్ల మనసులను దోచుకుంటోంది.


ఈ ఫొటోని గమనిస్తే.. భర్త సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా చేతులపై చిన్ని బేబీ గౌను ఉండగా.. దానిపై తమ మొదటి కూతురు సారాయా తన చిన్ని చేతిని ఉంచిన హృద్యమైన దృశ్యాన్ని ఈ పిక్‌లో చూడవచ్చు. ఈ ఫొటోకు క్యాప్షన్‌గా.. ‘‘మరోసారి దైవం ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతి మాకు దక్కింది.. మా హృదయాలు ఎనలేని ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి’’ (Blessed once again with the greatest gift of all.. Our hearts are so full of love and gratitude) అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం కియారా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


‘షేర్షా’ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన సిద్ధార్థ్-కియారాలు 2023లో రాజస్థాన్‌ వేదికగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి గతేడాది ముద్దుల కూతురు ‘సారాయా మల్హోత్రా’ జన్మించింది. మొదటి బిడ్డ పుట్టిన కొద్దికాలానికే మళ్లీ ఈ జంట రెండో బిడ్డకు స్వాగతం పలకబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కియారా పెట్టిన ఈ పోస్ట్‌పై బాలీవుడ్ ప్రముఖులు, దక్షిణాది సినీ తారలు, నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతూ ఈ జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఓవైపు స్టార్ హీరోయిన్‌గా వరుస భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, మరోవైపు కుటుంబ జీవితాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్న కియారాపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇవి కూడా చదవండి:

మండాడి సంచలన రికార్డు.. సుహాస్, సూరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్

అభిమాని హ‌త్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్

ధనుష్ కొత్త పార్టీ.. 'తమిళగ ఎళుచ్చి కళగం'? ఈసీ వద్ద నమోదు!

Updated Date - Oct 07 , 2026 | 02:17 PM