Kiara Advani: అలాంటి జ్ఞాపకాలు ఎన్నో పోగేసుకున్నా!

ABN , Publish Date - Jun 18 , 2024 | 10:18 AM

'ఫగ్లీ’ (2014’ చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు కియారా అడ్వాణీ (Kiara Advani) వరుసగా హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమెను 'భరత అనే నేను’(Bharat ane nenu) చిత్రం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ పలకరించింది.

Kiara Advani: అలాంటి జ్ఞాపకాలు ఎన్నో పోగేసుకున్నా!

'ఫగ్లీ’ (2014’ చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు కియారా అడ్వాణీ (Kiara Advani) వరుసగా హిందీ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమెను 'భరత అనే నేను’(Bharat ane nenu) చిత్రం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ పలకరించింది. అప్పటి నుంచి అటు తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. కియారా కథానాయికగా పరిచయమై పదేళ్లు పూర్తయింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేసింది. పదేళ్లల్లో తన అనుభవాలు పంచుకుంది. ‘‘కుటుంబంతో కలిసి చూసే  సినిమాల్లో నటించడమే నా లక్ష్యం. నటిగా ఎదగాలనే లక్ష్యంతో నాకు 21 ఏళ్లు ఉన్నప్పుడు సినీ కెరీర్‌ను ప్రారంభించాను. అప్పుడు నేనేం చేస్తున్నానో.. ప్రేక్షకులకు ఎలా దగ్గరవ్వాలో కూడా తెలియదు. ఎలాంటి సినిమాలని ఎంచుకోవాలో అవగాహన లేదు. గైడ్‌ చేసేవాళ్లు లేరు. కానీ నా పదేళ్ల ప్రయాణంలో జీవితంలో ఎలా పైకి ఎదగాలో నేర్చుకున్నాను. పాత్రలు, కథల ఎంపికలో మార్పులు చేస్తూ.. కుటుంబంతో కలిసి చూసేలా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.

Kiara-2.jpg

ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఇదే! ఈ ప్రయాణంలో ఎన్నో మరచిపోలేని జ్ఞాపకాలు పోగేసుకున్నా. ఇప్పటికీ ప్రతి రోజు కొత్తగానే ఉంటుంది. ప్రేమ, కలలు, చిరునవ్వులు, కన్నీళ్లు.. ఇలా ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాను. నా లక్ష్యాన్ని సాధించడానికి సహకరించిన దర్శక నిర్మాతలకు సహనటులు, ఫ్యాన్స్ కు  ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని అన్నారు. ప్రస్తుతం కియారా తెలుగులో 'గేమ్‌ ఛేంజర్‌' చిత్రంలో నటిస్తోంది. రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్‌ దర్శకుడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 02:38 PM