సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kala Hiran: సల్మాన్‌ ఖాన్ కు అనుకూలంగా తీర్పు

ABN, Publish Date - Jul 28 , 2026 | 12:11 PM

కాలా హిరణ్‌ సినిమా విషయంలో సల్మాన్ ఖాన్ కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సల్మాన్ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్న సినిమా టీజర్ ను వెంటనే సోషల్ మీడియా నుంచి తొలగించాలనే ఆదేశించింది.

Salman Khan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. త్వరలో విడుదల కాబోతున్న హిందీ చిత్రం 'కాలా హిరణ్: ది బ్యాటిల్ ఫర్ లెగసీ' ప్రచార చిత్రాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1998లో కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ నిందితుడు. అయితే దానికి సంబంధించిన నాలుగు కేసుల్లో మూడింటిలో నిర్దోషిగా సల్మాన్ ఖాన్ బయట పడ్డాడు. అందులో ఆర్మ్స్ యాక్ట్ కేసు కూడా ఉంది. మిగిలిన మరో కేసులో శిక్షపై కూడా అమలు నిలిపివేయబడిందని అతని తరఫున న్యాయవాదులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆనాటి సంఘటన ఆధారం తెరకెక్కిన 'కాలా హిరణ్‌' సినిమాలోని ఓ పాత్రను సల్మాన్ ఖాన్ తరహాలో చూపించడంపై కోర్టుకెక్కాడు. తన వ్యక్తిగత హక్కుల్ని ఈ సినిమా నిర్మాత ఉల్లంఘించారని సల్మాన్ తెలిపాడు.


తాజాగా ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి సింగ్‌... చిత్ర నిర్మాతను తీవ్రంగా ఆక్షేపించింది. డిజిటల్ మీడియా నుంచి ఈ సినిమా ప్రచార చిత్రాలను వెంటనే తొలగించాలని తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఇటీవల సల్మాన్ ఖాన్ పంపిన కోర్టు నోటీసును నిర్మాత చింపేసి, దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల కూడా న్యాయామూర్తి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిర్మాత అమిత్ జానీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటూ ఆమె అతని తరఫున న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సల్మాన్ తరఫున లాయర్లు 'తమ క్లయింట్ ను అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయన్నట్టుగా ఈ మూవీ టీజర్ లో చూపించారని, సల్మాన్ పోలిన వ్యక్తినే ఎంపిక చేసుకున్ని, అతని చేతిలో తుపాకీ ఉన్నట్టుగా చూపించి తప్పుడు ప్రచారాన్ని జరుపుతున్నార'ని వాపోయారు. వారి వాదనలను విన్న న్యాయమూర్తి ఇరవై నాలుగు గంటల్లో ఈ సినిమా ప్రచార చిత్రాలను తొలగించాలని, లేకపోతే పరిణామాలను తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

బాక్సాఫీస్ బరిలో.. రెండు కుటుంబాలు.. నలుగురు హీరోలు! విజ‌యం.. ఎవ‌రికి ద‌క్కేనో

ఎన్టీఆర్ భుజానికి గాయం... ఎనిమిది వారాల విశ్రాంతి!

Updated Date - Jul 28 , 2026 | 12:11 PM