సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రియుడిని పెళ్లాడిన ఆర్జీవీ హీరోయిన్.. ఫొటోలు వైరల్

ABN, Publish Date - Sep 28 , 2026 | 11:41 AM

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పరిచయం చేసిన హాట్ బ్యూటీ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anaika Soti weds Ted The Stoner

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పరిచయం చేసిన హాట్ బ్యూటీ అనైకా సోటి (Anaika Soti) పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్, ‘టెడ్ ది స్టోనర్’ (Ted The Stoner) పేరిట సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న జితేంద్ర శర్మను ఆమె వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమ ప్రయాణం తాజాగా మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంగా మారింది. తమ పెళ్లికి సంబంధించిన అందమైన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులతో ఈ శుభవార్తను పంచుకున్నారు.


తన వివాహంపై అనైకా సోటి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘స్నేహితులుగా మా ప్రయాణం మొదలైంది.. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం.. అలా ప్రేమలో పడ్డాం. ఆరేళ్ల కాలంలో లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలు, సంతోషాలు, త్యాగాలు, అపరిమితమైన ప్రేమ.. ఈ ప్రయాణం ఇలాగే కలకాలం కొనసాగాలని రాసిపెట్టి ఉంది. అందుకే, మా ఈ బంధాన్ని శాశ్వతం చేసుకున్నాం’’ అంటూ తమ ప్రేమను వ్యక్తం చేశారు.


రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య 2’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన అనైకా.. తన గ్లామర్‌తో మొదటి సినిమాతోనే యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆర్జీవీ దర్శకత్వంలోనే ‘365 డేస్’ చిత్రంలో నటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో కెరీర్ ఊపందుకోలేదు. ఇటీవల కాలంలో సరైన అవకాశాలు రాకపోవడంతో వెండితెరకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ నూతన దంపతులకు నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

దాదా.. బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

150 కోట్ల క్లబ్‌లోకి ‘ద ప్యారడైజ్’.. అసలు పరీక్ష స్టార్ట్

అప్పుడు వెంకీకి నేనెవరో తెలియదు: త్రివిక్రమ్

Updated Date - Sep 28 , 2026 | 11:41 AM