Allu Arjun: రామాయణ.. మన సంస్కృతికి ప్రతిబింబం

ABN , Publish Date - Nov 04 , 2026 | 07:11 PM

ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం 'రామాయణం: పార్ట్ 1' (Ramayana: Part 1). రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Ramayana

ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం 'రామాయణం: పార్ట్ 1' (Ramayana: Part 1). రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ పౌరాణిక దృశ్యకావ్యానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహించగా.. నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇప్పటిక్ ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రతి పోస్టర్, సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను నెలకొల్పాయి. నవంబర్ 5 న ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ కి సిద్ధమవుతోంది.


ఇక తాజాగా రామాయణ సినిమాకి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సపోర్ట్ లభించింది. బన్నీ.. రామాయణ చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలుపుతో ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 'రామాయణ చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. ఇది మన సంస్కృతికి ప్రతిబింబం, భారతీయ సినిమాల స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లే ఒక గొప్ప ప్రయత్నం. ఈ దివ్యమైన ప్రయత్నం కోసం చిత్ర బృందానికి నా స్వచ్ఛమైన, సానుకూల శుభాకాంక్షలను పంపుతున్నాను. మన కథలను, మన సంస్కృతిని, మన వైభవాన్ని చాటిచెప్పే ఈ స్వచ్ఛమైన ప్రయత్నానికి మనమందరం ఏకమై మద్దతుగా నిలుద్దాం. జై శ్రీరామ్' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అల్లు అర్జున్ అందించిన ఈ పాజిటివ్ మద్దతుపై రామాయణ చిత్ర దర్శకుడు నితీశ్ తివారీ వెంటనే స్పందిస్తూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. పాన్-ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్ చూపించిన ఈ అభిమానం, ప్రోత్సాహం తమ చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. హాలీవుడ్ స్థాయి సాంకేతిక విలువలతో, ఆస్కార్ విజేతలు హన్స్ జిమ్మర్, ఎ.ఆర్. రెహమాన్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ ఇచ్చిన సపోర్ట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచేసింది. మరి ఈ సినిమా రేపు బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

లేడీ పవర్‌తో నవంబర్ హీటెక్కనుందా

ఎన్టీఆర్ వదిలిన ఇట్లు అర్జున ట్రైలర్.. అదిరింది

మాయ లేడీ ట్రైలర్.. ట్విన్ సిస్టర్స్ తో హీరో రొమాన్స్

Updated Date - Nov 04 , 2026 | 07:19 PM