మాయ లేడీ ట్రైలర్.. ట్విన్ సిస్టర్స్ తో హీరో రొమాన్స్
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:20 PM
విలన్ గా కెరీర్ మొదలుపెట్టి.. మిర్చి, బాహుబలి వంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాకేష్ వర్రే (Rakesh Varre).
విలన్ గా కెరీర్ మొదలుపెట్టి.. మిర్చి, బాహుబలి వంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాకేష్ వర్రే (Rakesh Varre). ఎవరికీ చెప్పొద్దు సినిమాతో హీరోగా మారాడు. ఆ తరువాత నిర్మాతగా మారి పేకమేడలు సినిమాని తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం 'మాయ లేడీ’ (Maya Lady) అనే సినిమాతో ప్రేక్షకుల ముందకు రానున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రశంకర్ (Prasankar) దర్శకత్వం వహించగా రాకేష్ వర్రే తన సొంత బ్యానర్ లోనే నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా మాయ లేడీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. క్రిష్ ( రాకేష్ వర్రే) పిల్లలకు కరాటే నేర్పిస్తూ ఉంటాడు. అతనికి ఒక పట్టాన అమ్మాయిలు నచ్చరు. తనకు కరెక్ట్ అమ్మాయి దొరికేవరకు ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక అనుకోకుండా క్రిష్ లైఫ్ లోకి ఆశ(మధుమిత) వస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. సడెన్ గా ఆశ వేరేలా మారిపోతుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఆశ, రూప ట్విన్ సిస్టర్స్. క్రిష్ ని ఇద్దరూ ప్రేమిస్తారు. కానీ, క్రిష్ మాత్రం ఆశనే ప్రేమిస్తాడు. మరి చివరికి ఇద్దరి అక్కాచెల్లెళ్ల మధ్య ఇరుక్కున్న క్రిష్ ఏమైపోయాడు.. ? ఎవరిని పెళ్లాడాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ట్రైలర్ ప్రారంభంలోనే హీరో తాను ఎవరిని ప్రేమిస్తున్నానో తెలియక పడే తీవ్రమైన గందరగోళంతో కథలోని అసలు కాన్సెప్ట్‌ను రివీల్ చేశారు. పోలీసుల వద్దకు వెళ్లలేని 'లాస్ట్ అండ్ ఫౌండ్' పోగొట్టుకున్న విలువైన విషయాల సమస్యలను పరిష్కరించే ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్ నడిపే హీరోయిన్.. ఆమెని ప్రేమించే హీరో.. మధ్యలో సత్య కామెడీ ట్రైలర్లో మంచి హ్యూమర్‌ను క్రియేట్ చేశాయి. ప్రేమ, కన్ఫ్యూజన్, కవలల గందరగోళం కలగలిపిన ఈ యూత్‌ఫుల్ డ్రామా ప్రేక్షకులను థియేటర్లలో నవ్వుల సముద్రంలో ముంచెత్తుతోందని చెప్పవచ్చు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా మారనుంది. ప్రమోషనల్ కంటెంట్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ‘మాయ లేడీ’ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నవంబర్ 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రాకేష్ వర్రే ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ఇవి కూడా చదవండి:
నేరాలకు సినిమాలను బలిపశువును చేస్తారా?: సందీప్ రెడ్డి వంగా ఫైర్
సినిమా రెడీ... టైటిల్ మారాల్సిందే
దియా మీర్జా దీపావళి వీడియోపై రగడ.. బీఎంసీకి బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు