ఎన్టీఆర్ వదిలిన ఇట్లు అర్జున ట్రైలర్.. అదిరింది

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:49 PM

కొత్త కుర్రాడు అనీష్ (Aniesh), మలయాళ భామ అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). డెబ్యూ డైరెక్టర్ మహేష్ ఉప్పాల తెరకెక్కించిన ఈ సినిమాని డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మించగా.. అక్కినేని నాగార్జున సమర్పించాడు.

Itlu Arjuna

కొత్త కుర్రాడు అనీష్ (Aniesh), మలయాళ భామ అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itlu Arjuna). డెబ్యూ డైరెక్టర్ మహేష్ ఉప్పాల తెరకెక్కించిన ఈ సినిమాని డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మించగా.. అక్కినేని నాగార్జున సమర్పించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర అధికారిక ట్రైలర్‌ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేశారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ వెలువడటంతో ఈ చిన్న చిత్రంపై ఒక్కసారిగా పాన్-ఇండియా రేంజ్‌లో అంచనాలు పెరిగిపోయాయి.


ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అర్జున్ కి చిన్నతనం నుంచి మాటలు రావు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మాటలు రాకపోవడంతో తన ఇంటి పక్కనే ఉండే కీర్తికి తన ప్రేమను చెప్పలేకపోతాడు. అయితే విచిత్రంగా ఎవరికీ అర్ధం కానీ అర్జున్ భాష.. కీర్తికి అర్ధమవుతుంది. వీరిద్దరి మధ్య చిన్నగా ప్రేమ చిగురిస్తున్న సమయంలో అర్జున్ అనుకోకుండా ఒక డాన్ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ని కొట్టేస్తాడు. దానికోసం పెద్దన్న రంగంలోకి దిగుతాడు. ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది.. ? అర్జున్ - కీర్తి కలిసి ఆ డాన్ ని ఎలా ఎదుర్కుంటారు.. ? చివరికి అర్జున్ - కీర్తి ఒక్కటవుతారా.. లేదా.. ? అని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


ట్రైలర్ ప్రారంభంలోనే పోలీస్ డిపార్ట్‌మెంట్ అలర్ట్‌తో కథలోని సీరియస్‌నెస్‌ను చూపించారు. బడ్జెట్ విషయంలో మేకర్స్ కాంప్రమైజ్ కాలేదని విజువల్స్ చూస్తుంటే తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ అందించిన స్వరాలు, రాజా మహాదేవన్ ఛాయాగ్రహణం ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాస్, క్లాస్ అండ్ రొమాన్స్ ఎలిమెంట్స్ సమపాళ్లలో కుదిరిన ఫుల్-పాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేశారు. నవంబర్ 13 న ఇట్లు అర్జున ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో న్యూ గాయ్ అనీష్ హిట్ అందుకుంటాడా.. లేదా అనేది చూడాలి.

Updated Date - Nov 04 , 2026 | 05:54 PM