సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఆల్ఫా’ టీజర్.. ఆలియా భట్ యాక్షన్‌కి గూస్‌బంప్స్!

ABN, Publish Date - Jun 10 , 2026 | 03:50 PM

యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తోన్న భారీ యాక్ష‌న్ మూవీ ‘ఆల్ఫా’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ మూవీ టీజర్‌ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు.

Alpha Teaser out

యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) రూపొందిస్తోన్న భారీ యాక్ష‌న్ మూవీ ‘ఆల్ఫా’ (Alpha). బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ (Alia Bhatt) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్ శార్వరి (Sharvari) కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని గ్లోబ‌ల్ హిట్ సిరీస్ ‘రైల్వే మెన్’ ఫేమ్‌ శివ్ ర‌వైల్ తెర‌కెక్కిస్తున్నారు. అనీల్ క‌పూర్ కీల‌క పాత్ర‌లో కనిపించనున్నారు. జూలై 3న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ బుధవారం చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆలియా భట్ యాక్షన్‌కు అంతా ఫిదా అవుతున్నారు.


‘వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్’ వస్తోన్న ఈ మూవీ టీజర్‌ (Alpha Teaser)ని ‘ది ఫస్ట్ కిల్’ పేరుతో మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌ని గమనిస్తే.. యాక్ష‌న్ స్టార్ బాబీ డియోల్.. వ్యక్తులను చంపటానికి శిక్ష‌ణ ఇచ్చి పెంచి పెద్ద చేసిన ఓ హంత‌కురాలి క‌థ‌తో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా ఫస్ట్ షాట్‌లోనే మేకర్స్ తెలియజేశారు.కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్, ఒక ఇంటెన్స్ ఒరిజిన్ స్టోరీగా ఈ చిత్రాన్ని మలిచినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ‘ఇండియా నెక్స్ట్ జనరేషన్ సోల్జర్స్’ను తయారుచేసే ఒక సీక్రెట్ ప్రోగ్రామ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం టీజర్‌లో క్లారిటీ ఇచ్చారు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి.


‘ఈ ప్రపంచంలో కేవలం రెండు రకాల మనుషులే ఉంటారు.. ఒకటి వోల్ఫ్ (తోడేలు), రెండు షీప్ (గొర్రె).. నేను వోల్ఫ్‌ని’ అని బాబీ డియోల్ హెచ్చరిస్తే.. ‘వోల్ఫ్ కూతురు వోల్ఫే అవుతుంది సార్’ అంటూ ఆలియా భట్ ఇచ్చే కౌంటర్ అండ్ యాక్షన్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఆలియా భట్ తన 18వ పుట్టినరోజున ఫస్ట్ మిషన్‌కు వెళ్లడం, చైల్డ్‌హుడ్ నుంచి ఆమెకు ఇచ్చిన కఠినమైన ట్రైనింగ్ షాట్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. టీజర్ చివరలో వచ్చే యాక్షన్ కట్, గన్ షాట్స్, ‘ఆల్ఫా’ లోగో డిజైన్ పక్కా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి లేడీ-ఓరియంటెడ్ క్రేజీ యాక్షన్ ఫిల్మ్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి:

భారతీరాజా ‘సీతాకోకచిలుక’ హ్యాపీ ఎండింగ్‌కి కారణమిదే: ఏడిద రాజా

భారతీరాజా మృతికి ప్రముఖుల నివాళి

‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!

బాలయ్య అన్‌స్టాపబుల్ జోష్

Updated Date - Jun 10 , 2026 | 03:50 PM