సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ajay Devgn: గృహప్రవేశ్‌ కాదు... సూర్య స్పర్శ్‌

ABN, Publish Date - Sep 22 , 2026 | 05:06 PM

అజయ్‌ దేవ్‌గన్‌ కొత్త సినిమా పేరును 'సూర్య స్పర్శ్‌'గా మార్చారు. గరుడపురాణం ఆధారంగా తెరకెక్కతున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీని రోహిత్‌ జుగ్రాజ్ డైరెక్ట్ చేస్తున్నారు.

Ajay Devgn

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ సినిమా పేరు మారింది. అజయ్‌ దేవ్‌గన్‌ హీరోగా రోహిత్‌ జుగ్రాజ్‌ దర్శకత్వంలో 'గృహప్రవేశ్‌' అనే హారర్ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కుతోంది. సెప్టెంబర్‌ 2న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్‌ను నవంబర్‌లో ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాను కుమార్‌ మాంగత్‌, అభిషేక్ పాఠక్‌, అజయ్‌ దేవ్‌గన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రెగ్యులర్ హారర్‌ థ్రిల్లర్స్ కు భిన్నంగా సూపర్ నేచురల్‌ అంశాలతో గరుడ పురాణ గాథను మిళితం చేస్తూ రోహిత్‌ ఈ కథను రాసుకున్నాడు. మొదట్లో దీనికి 'గృహప్రవేశ్‌' అనే టైటిల్‌ అనుకున్నారు. అయితే ఇప్పుడీ సినిమాకు 'సూర్య స్పర్శ్‌' అనే పేరు ఖరారు చేశారు. ఈ సినిమాను వచ్చే యేడాది ద్వితీయార్ధంలో విడుదల చేయాలన్నది మేకర్స్ ఆలోచన.

ఇవి కూడా చదవండి:

సినీ ప్రయాణంలో 48 వసంతాలు.. మెగాస్టార్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Nidhhi Agerwal: మంచి క‌థ, పాత్ర‌ల‌కు.. త‌మిళ సినీ రంగ‌మే ఉత్త‌మం

The Paradise: జ‌డ‌ల్‌.. సెన్సార్ క‌త్తెర‌కు బాగానే ప‌ని చెప్పాడుగా

Updated Date - Sep 22 , 2026 | 05:10 PM