Sriram: తమిళం నుండి తెలుగులోకి నిశ్శబ్ద ప్రేమ
ABN , Publish Date - May 22 , 2025 | 01:02 PM
శ్రీరామ్ నటించిన తమిళ చిత్రం తెలుగులో 'నిశ్శబ్ద ప్రేమ' పేరుతో డబ్ అవుతోంది. శుక్రవారం జనం ముందుకు రాబోతున్న ఈ చిత్రం టీజర్, సాంగ్ ను బుధవారం విడుదల చేశారు.
పలు సినిమాలు, వెబ్ సీరిస్ లతో తెలుగు వారికి చేరువయ్యాడు హీరో శ్రీరామ్. అతను నటించిన తమిళ చిత్రం ఒకటి 'నిశ్శబ్ద ప్రేమ' పేరుతో తెలుగులో ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ ను, పాటను రిలీజ్ చేశారు. కార్తికేయన్ ఎస్ నిర్మించిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను రాజ్ దేవ్ డైరెక్ట్ చేశాడు. ఇందులో ప్రియాంక తిమ్మేష్ హీరోయిన్ గా నటించింది. బుధవారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, నిర్మాత చింతపల్లి రామారావు, నిర్మాత రాజేశ్ పుత్ర, డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ ట్రైలర్ లాంఛ్ చేయగా, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ సాంగ్ విడుదల చేశారు.
తమిళంలో ఈ సినిమా చక్కని విజయాన్ని అందుకుందని, దాదాపు యాభై కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని, ఈ సినిమాతో తన మిత్రుడు పరిటాల రాంబాబు పంపిణీ దారుడిగా మారడం ఆనందంగా ఉందని వీరశంకర్ అన్నారు. తెలుగువాడైన శ్రీరామ్ చక్కటి కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడని, వయొలెన్స్ కంటే సైలెన్స్ కు ఎక్కువ శక్తి ఉంటుందని, అలానే ఈ 'నిశ్శబ్ద ప్రేమ' చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు ప్రసన్నకుమార్. తాను నటించిన తొలి తమిళ చిత్రం ఇదని, ఇదిప్పుడు తెలుగులోనూ డబ్ కావడం ఆనందంగా ఉందని మలయాళ నటుడు వియాన్ చెప్పాడు. లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి దర్శకుడు దీనిని తీశాడని, ప్రేక్షకులను ఇది ఏమాత్రం నిరుత్సాహపర్చదని హామీ ఇచ్చాడు హీరో శ్రీరామ్. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్ ప్రియాంక తిమ్మేష్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల మనసుల్ని చూరగొంటుందని తెలుగు నిర్మాత చింతపల్లి రామారావు, దర్శకుడు రాజ్ దేవ్ అన్నారు.
Also Read: Sugar Baby: తమన్నాతో పోటీపడుతున్న త్రిష...
Also Read: Pan India: రాజమౌళి, సుకుమార్... ఆ తర్వాత...
Also Read: Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి