Pan India: రాజమౌళి, సుకుమార్... ఆ తర్వాత...
ABN , Publish Date - May 22 , 2025 | 10:26 AM
ఆల్ ఇండియాలో తడాఖా చూపించిన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరంటే - రాజమౌళి, సుకుమార్ పేర్లే ముందుగా వినిపిస్తాయి... వీరిద్దరూ పాన్ ఇండియా మూవీస్ తో చేసిన హంగామా అంతా ఇంతా కాదు... మరి వీరిద్దరి తరువాత ఆ రేంజ్ లో అలరించే డైరెక్టర్ ఎవరు?... ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే టాక్...
ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) గురించి ఏ సినిమా రంగంలో చర్చ సాగినా ముందుగా డైరెక్టర్స్ రాజమౌళి (Rajamouli), సుకుమార్ (Sukumar) పేర్లే వినిపిస్తున్నాయి... వీళ్ళేనా ఇంకెవరూ లేరా అంటే లేరనే చెప్పాలి... ఎందుకంటే వీరిద్దరే సీక్వెల్స్ తోనూ పాన్ ఇండియా లెవెల్లో భళా అనిపించారు... రాజమౌళి 'బాహుబలి' (Bahubali) సిరీస్, సుకుమార్ 'పుష్ప' (Pushpa) రెండు భాగాలు పాన్ ఇండియా మూవీస్ గా చేసిన హంగామా అంతా ఇంతా కాదు... వీరి సీక్వెల్స్ లో రెండో భాగంగా వచ్చిన 'బాహుబలి-2', 'పుష్ప-2' రెండు చిత్రాలు 1600 కోట్లకు పైగా వసూలు చేశాయి... ఆ రేంజ్ లో అలరించిన తెలుగు సినిమా మరోటి కానరాదు... అందువల్లే రాజమౌళి, సుకుమార్ చుట్టూనే చర్చ సాగుతోంది... మరి వీరిద్దరి తరువాత ఎవరు అన్న టాక్ లో ముందుగా నాగ్ అశ్విన్ పేరు వినిపిస్తోంది... ఎందుకంటే నాగ్ అశ్విన్ (Naga Ashwin) తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడి' (Kalki 2898 A.D.) సినిమా కూడా వెయ్యి కోట్లకు పైగా పోగేసింది... ఆ సినిమాకు కూడా సీక్వెల్ ఉంది... దాంతో అశ్విన్ కూడా ఓ పదిహేను వందల కోట్లు ఈజీగా పట్టేస్తాడని పరిశీలకులు అంటున్నారు...
రాజమౌళి, సుకుమార్ తరువాత ఆ రేంజ్ లో సక్సెస్ సాధించే టాలీవుడ్ డైరెక్టర్ ఎవరు అన్న ప్రశ్నకు నాగ్ అశ్విన్ తో పాటు వినిపిస్తున్న మరో పేరు కొరటాల శివ (Koratala Siva)... ఈయన దర్శకత్వంలో యన్టీఆర్ (NTR) హీరోగా రూపొందిన 'దేవర' (Devara) పాన్ ఇండియా మూవీగానే రిలీజయింది... పెట్టుబడికి తగ్గ రాబడి చూసింది... కానీ, 500 కోట్ల వద్దే ఆగిపోయింది... మరి కొరటాల పేరు ఎందుకు ప్రస్తావనకు వస్తోంది అంటే 'దేవర' సినిమాకు కూడా సీక్వెల్ ఉంది... ఆ సినిమాలోనే అసలైన కథ సాగుతుందని వినిపిస్తోంది... అందువల్ల 'దేవర-2'తో కొరటాల శివ కూడా 1500 కోట్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉందని టాక్... ఎందుకంటే ఆ సినిమాకు ముందుగానే యన్టీఆర్ నటించిన హిందీ మూవీ 'వార్ -2', ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటిస్తోన్న 'డ్రాగన్' (Dragon) సినిమా కూడా రిలీజవుతాయి... దాంతో 'దేవర-2'కు మరింత బజ్ క్రియేట్ అవుతుందని ట్రేడ్ పండిట్స్ టాక్!
రాజమౌళి, సుకుమార్ తరువాత నాగ్ అశ్విన్, కొరటాల శివ పేర్లు వినిపించడానికి వారి సీక్వెల్స్ కారణం! కాగా, ఏ సీక్వెల్ తోనూ సంబంధం లేకుండా మరికొందరు తెలుగు దర్శకుల పేర్లు కూడా చర్చల్లో చోటు సంపాదిస్తున్నాయి... అలాంటి వారిలో దర్శకరచయిత త్రివిక్రమ్ (Trivikram) ఉన్నాడు... ఆయన తరువాతి చిత్రం తప్పకుండా అల్లు అర్జున్ (Allu Arjun) తోనే ఉంటుందని టాక్! ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో నటిస్తోన్న బన్నీ, ఆ పై త్రివిక్రమ్ తోనే సాగుతాడని వినిపిస్తోంది... అందువల్ల త్రివిక్రమ్ కూడా రేసులో ఉన్నాడని అభిమానుల అభిలాష! ఇక రామ్ చరణ్ తో 'పెద్ది' సినిమా రూపొందిస్తోన్న బుచ్చిబాబు సానాకు కూడా ఛాన్స్ ఉందని కొందరి మాట!... ఎందుకంటే 'పెద్ది' సినిమా పాన్ ఇండియా మూవీగా రానుంది... రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ తో ఈ సినిమా తప్పకుండా వెయ్యి కోట్లు పట్టేస్తుందని అంటున్నారు... మరి వీరిలో ఎవరు రాజమౌళి, సుకుమార్ తరువాత మేమే అనిపించుకుంటారో చూద్దాం...
Also Read: Kothalavadi: నిర్మాతగా మారిన స్టార్ హీరో మదర్...
Also Read: Seetharama Sastry: రామజోగయ్య శాస్త్రికి సిరివెన్నెల పురస్కారం
Also Read: Tumbbad: ఏక్తాకపూర్ కు చెయ్యిచ్చిన శ్రద్ధా కపూర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి